సినిమా టైటిల్ లేకుండా వారణాసి నగరంలో వెలిసిన కొన్ని హోర్డింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా రిలీజ్ డేట్‌ను హోర్డింగ్స్ మీద ప్రకటించి ప్రమోషన్స్‌లో కొత్త పంథాను మొదలు పెట్టాడు రాజమౌళి. హాలీవుడ్ మీడియా సైతం ఈ హోర్డింగ్స్ పై కథనాలు రాస్తున్నాయి. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడానికి కాస్త సమయం పట్టినా.. 2027 ఏప్రిల్ 7న థియేట్రికల్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది వారణాసి.
Also Read : Sai Abhyankkar : తమిళ సెన్సేషన్ సాయి అభ్యంకర్.. ఇక వాళ్ళు దుకాణం సర్దుకోవాల్సిందే.
ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన వారణాసి సెట్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణం పై ఫిబ్రవరి మూడో వారం వరకు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్‌ని అంటార్కిటికాలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ప్రాంతమైన అంటార్కిటికాలో షూటింగ్ చేయడమంటే మామూలు విషయం కాదు. అంటార్కిటికా అనేది తీవ్రమైన చలి, మంచు తుఫాన్లు, కఠినమైన జీవన పరిస్థితులతో కూడిన ప్రాంతం. అలాంటి చోట సినిమా షూటింగ్ నిర్వహించడం అంటే.. సాహసంతో పాటు అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, ముందస్తు ప్రణాళిక అవసరం. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది ‘వారణాసి’ చిత్ర బృందం. దీంతో.. అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ చరిత్ర సృష్టించనుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అక్కడ షూటింగ్ చేసిన ఐదవ చిత్రంగా ఇది నిలవనుంది. ఏదేమైనా.. వారణాసి చిత్రాన్ని ఊహించని లొకేషన్లలో చిత్రీకరించి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి.
