Vangaveeti Asha Kiran: వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖలో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్ ని రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడారు. రాధా రంగ మిత్ర మండలి సభ్యులను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబరు 26న విశాఖలో రంగా నాడు పేరు తో సభ పెట్టాం.. కుల, మత, రాజకీయాకు అతీతంగా జరిగే సభ ఇది.. రంగా అభిమానులు కోసం నిర్వహించే సభ … అన్ని పార్టీ ల్లో ఉన్న అభిమానులు రావాలని పిలుపునిచ్చారు. చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు అని నాన్న రంగ చెప్పేవారు.. ఇప్పుడు అదే స్లోగన్ తో రాధారంగ మిత్ర మండలి ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామన్నారు.
READ MORE: Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ అక్రమాల కేసు.. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు!
తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని ఆశా కిరణ్ తెలిపారు. “రాధారంగ మిత్ర మండలి తరపున పనిచేయడానికే వచ్చాను.. ఏ పార్టీ తో ఇప్పుడు నాకు సంబంధం లేదు.. చారిటబుల్ కింద రాధారంగ మిత్ర మండలి పని చేస్తుంది.. నా రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తరువాత చెబుతాను.. ప్రస్తుతం ప్రజలకు నా వంతుగా సేవ చేస్తా.. రాధా రంగ మిత్ర మండలి కార్యక్రమం విస్తృతం చేస్తాం.. రంగా గారి ఆశయాల సాధన కోసం నేను పని చేస్తా.. నేను రేపు ఎటువంటి రాజకీయ ప్రకటన చేయడం లేదు, ఏ పార్టీ లో చేరడం లేదు. .రంగా ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే వారంతా ఆయన వారసులే.. మా అన్న వంగవీటి రాధాకృష్ణతో ఎటువంటి విభేదాలు లేవు.. అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయవద్దని మా విజ్ఞప్తి.. విశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకృష్ణను ఆహ్వానించారు.. మూడేళ్లు నా పని తీరు, నా సేవా కార్యక్రమాలు అందరూ చూస్తారు.. రాధారంగ మిత్ర మండలి పెద్దల ఆదేశాలు, సూచనల ప్రకారం నా రాజకీయ నిర్ణయం అప్పుడు ఉంటుంది..” అని తెలిపారు.
READ MORE: ఒకే ధర, ఒకే పర్ఫార్మన్స్.. iQOO 15 vs OnePlus 15 ఏది బెస్ట్ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్..?
