Vande Bharat: ప్రధాని ప్రతిష్టాపకంగా ప్రారంభించిన వందే భారత్ ట్రైన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మామూలు ట్రైన్లతో పోలిస్తే ఈ రైళ్ల ఆక్యుపెన్సీ భారీగా ఉంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రైళ్లపై కేటుగాళ్లు తరచు రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో రైళ్లపై దాడులు కొనసాగాయి. తాజాగా కేరళలోని వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. వారం వ్యవధిలో ఇది రెండో ఘటన. దీంతో అధికారుల అప్రమత్తం అయ్యారు.
Read Also:Kushi: ‘ఆరా బేగమ్’పై మనసు పారేసుకున్న ‘ది’ దేవరకొండ…
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 3.27 గంటలకు వలపట్టణం- కన్నూర్ చిరక్కల్ మధ్య రైలు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు రువ్వారు. రైలు కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తోంది. రైలు ఉత్తర కేరళలోని జిల్లాలోని వలపట్టణం ప్రాంతం గుండా వెళ్తుండగా దాని కిటికీ అద్దాలపై రాళ్లు రువ్వడం వల్ల స్క్రాచ్ అయినట్లు రైల్వే అధికారులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. రైలుపై రాళ్లు రువ్వినట్లు అనుమానించిన రైల్వే అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన సరిగ్గా దాని వలపట్టణం పరిధిలో జరిగిందని నిర్ధారించనప్పటికీ, దర్యాప్తు ప్రారంభించామనీ, ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Read Also:The Kerala Story: సినిమా బాన్… ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఊహించని స్టేట్మెంట్
కేరళలోని తొలి వందే భారత్ రైలును ఏప్రిల్ 25న ప్రధాని నరేంద్ర మోడీ తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. మలప్పురం జిల్లాలోని తిరూర్ స్టేషన్ వద్ద ఆగాలని కోరుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నిరసనలు చేపట్టింది. వందే భారత్ రైలును ప్రకటించిన వెంటనే మొదటి రిపోర్టుల్లో తిరూర్ కూడా స్టాప్ ల జాబితాలో ఉంది. అయితే, తరువాత, షోర్నూర్ చేర్చబడినప్పుడు దానిని తొలగించారు.