Site icon NTV Telugu

Kurnool Diamond: వ్యవసాయ కూలీకి దొరికిన విలువైన వజ్రం.. క్యూ కట్టిన వ్యాపారులు! ధర తెలిస్తే షాకే

Kurnool Diamond

Kurnool Diamond

తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ఊపందుకుంది. కొన్ని రోజులుగా జనం, రైతులు తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు వజ్రాల వేట కోసం పొలాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కొందరికి విలువైన వజ్రాలు దొరికాయి. ఇప్పటికే తుగ్గలి మండలంలో మదనంతపురం, జొన్నగిరిలో విలువైన వజ్రాలు లభించగా.. తాజాగా పెండకల్ గ్రామంలో ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభ్యమైంది.

Also Read: Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి పదవీ లాభాలు పక్కా!

తుగ్గలి మండలం పెండకల్ గ్రామంలో వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం దొరికింది. విషయం తెలిసిన ఓ వ్యాపారి.. ఆ డైమండ్‌ను 10 లక్షలకు అడిగాడు. రేటు కుదరకపోవడంతో ఆ వ్యాపారి నిరాశగా వెనుదిరిగాడు. వజ్రం విలువ రూ.50 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. వజ్రం కొనుగోలు కోసం వ్యవసాయ కూలీ దగ్గరికి వ్యాపారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో అతడు భారీ ధర చెబుతున్నాడు. ఏదేమైనా ఆ వ్యవసాయ కూలీ పంట పండిందనే చెప్పాలి. విషయం తెలిసిన జనాలు డైమండ్‌ను చూసేందుకు పెండకల్ గ్రామంకు బారులు తీరారు. అంతేకాదు సదరు ప్రాంతంలో డైమండ్స్ కోసం గాలిస్తున్నారు కూడా.

Exit mobile version