వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఉన్న వంశీ అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
Also Read:CM Revanth Reddy : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి
మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు. అయితే, వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వచ్చినా.. ఆయన జైలులోనే గడపాల్సిన పరిస్థితి.. మరికొన్ని కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
