Site icon NTV Telugu

Vakkantham Vamsi : నా కెరీర్ లో కథ అందించి చూడలేకపోయినా సినిమా అదొక్కటే..

Whatsapp Image 2023 12 07 At 4.05.06 Pm

Whatsapp Image 2023 12 07 At 4.05.06 Pm

వక్కంతం వంశీ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు కథను అందించారు. ముఖ్యం గా సురేందర్ రెడ్డి సినిమాలకు వక్కంతం వంశీ నే కథని అందిస్తూ వుంటారు.అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడి గా మారారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో కాస్త గ్యాప్ తీసుకోని యంగ్ హీరో నితిన్ తో ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను తెరకెక్కించారు.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏజెంట్ మూవీపై వక్కంతం వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఏజెంట్ మూవీ కథ తనదేనని ఆయన పేర్కొన్నారు. కానీ తాను ఇప్పటివరకు ఆ సినిమా చూడలేదని, తన కథలో సురేందర్‌రెడ్డి ఏం మార్పులు చేశారు..స్క్రీన్‌పై ఏవిధంగా చూపించారన్నది కూడా నాకు తెలియదని ఆయన అన్నారు..

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటంతో థియేటర్లలో ఏజెంట్ మూవీ చూడటం వీలుపడలేదని, ఆ తర్వాత ఓటీటీలో చూడాలని అనుకుంటే ఆ సినిమా రిలీజ్ కాలేదని వక్కంతం వంశీ తెలిపారు.ఏజెంట్ మూవీకి రైటర్‌గా తన పేరు ఉంది కాబట్టి ఆ సినిమా ఫెయిల్యూర్‌లో తన భాగం కూడా ఉంటుందని వక్కంతం వంశీ పేర్కొన్నారు.. కెరీర్‌లో తాను కథను అందించి చూడలేకపోయినా సినిమా ఇదొక్కొటేనని వంశీ చెప్పుకొచ్చారు.అయితే అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజైంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పది కోట్ల లోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు తేరుకోలేని నష్టాలను మిగిల్చింది.దీనితో ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ కూడా బ్రేక్ పడుతూనే వస్తుంది. మరి ఏజెంట్ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి..

Exit mobile version