Atal Modi Suparipalana Yatra: అటల్ మోడీ సుపరిపాలన యాత్ర శుక్రవారం విజయనగరం చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పీవీయన్ మాధవ్, మంత్రులు సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, రమేష్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వాళ్లు మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన అటల్ – మోడీ సుపరిపాలన యాత్ర సభలో వెంకయ్యనాయుడు, మాధవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
READ ALSO: Odisha: పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్‌వే.. 187 పోస్టులకు 8,000 మంది పోటీ
ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవియన్ మాధవ్ మాట్లాడుతూ.. అటల్ మోడీ సుపరిపాల యాత్ర ద్వారా ఏపీలో 26 జిల్లాల్లో వాజ్‌పేయ్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయ్ గొప్పతనంతో పాటు, మోడీ అందిస్తున్న సుపరిపాలను వివరించేలా సభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాజ్‌పేయ్ గురించి అన్ని విధాలా తెలిసిన వ్యక్తి, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ శభాష్ అనిపించుకున్న వ్యక్తి వెంకయ్యనాయుడు అని అన్నారు. వాజ్‌పేయ్, వెంకయ్యనాయుడు, మోడీలకు సారూప్యత ఉందని, వారంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చి తమ కృషితో గొప్ప స్థాయికి ఎదిగిన వారని అన్నారు. ఈ కార్యక్రమానికి రావడానికి వెంకయ్యనాయుడు ఎంతో శ్రమ తీసుకున్నారని, ఈ సభలో వెంకయ్యనాయుడు పాల్గొనడం నిండుదనాన్ని ఇచ్చిందని అన్నారు.
అటల్ జీ పెళ్లి కూడా చేసుకోకుండా, తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేశారని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. దేశ విభజన మరోసారి జరగకూడదని భారతీయ సంఘ్ ఏర్పాటు చేశారని చెప్పారు. 1998 లో వాజ్ పేయ్ ప్రధాని అవగానే అణు విస్పోటనం చేసి, భారతదేశాన్ని అణుశక్తి దేశంగా మార్చారని అన్నారు. దేశం నేడు సురక్షింతగా ఉందంటే దానికి వాజ్ పేయ్ ముందు చూపే కారణం అని అన్నారు. మధురలో తన ఓటమిని కూడా ఆయన పాజిటీవ్ గా తీసుకున్నారని, రాజా ప్రతాప్ సింగ్ చేతిలో ఓడినందుకు గర్విస్తున్నా అని చెప్పారని గుర్తు చేశారు. ఆయన 70 ఏళ్ల సామాజిక జీవితంలో, 60 ఏళ్లు పార్లమెంటెన్‌గా ఆయన జీవితం ఆదర్శంగా నిలిచిందన్నారు. డిసెంబర్ 25న ఆయన జయంతి సందర్భంగా అమరావతిలో వాజ్‌పేయ్ స్మృతి వనాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు.
READ ALSO: Hardik Pandya Fifty: హార్దిక్ పాండ్యా విధ్వంసం.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
