NTV Telugu Site icon

World Blitz Championship: చెస్‌ క్రీడా ప్రపంచంలో మరోసారి సత్తా చాటిన భారత్‌..

Vaishali

Vaishali

World Blitz Championship: భారతదేశం మరోసారి ప్రపంచ చెస్ క్రీడలో సత్తా చాటింది. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్యం సాధించి దేశానికి గర్వకారణం చేకూర్చింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది. ఇది ఆమెకు మరో చిరకాలిక మైలురాయిగా నిలిచింది. మహిళల విభాగంలో వైశాలి క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనాకు చెందిన జు జినార్ ను 2.5-1.5 తేడాతో ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆమెకు పథకం ఖాయమైంది. కానీ, సెమీస్‌లో చైనాకు చెందిన వెంజున్ చేతిలో 0.5-2.5 తేడాతో పరాజయం చెందింది. అయినప్పటికీ, ఆమె కాంస్యం అందుకుంది.

Also Read: Gaza : గాజాలో నెత్తురుతో కొత్త సంవత్సరానికి వెల్ కమ్.. ఇజ్రాయెల్ దాడిలో 17 మంది పాలస్తీనియన్లు మృతి

ఇదే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఈవెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. హంపి విజయం భారత చెస్ క్రీడకు మరింత ప్రోత్సాహం తీసుక వచ్చింది. వైశాలిని భారత చెస్ లెజెండ్, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినా విశ్వనాథన్ ఆనంద్ అభినందించారు. ఆయసోషల్ మీడియా వేదికపై వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన వైశాలికి అభినందనలు. దేశం మరింత గర్వపడేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. వైశాలి విజయంపై ఆనంద్ ప్రశంసలు కురిపించారు.

Also Read: Alcohol Effect: ఇంత ట్యాలెంటెడ్‭గా ఉన్నవేంట్రా బాబు.. అక్కడ ఎలా పడుకున్నావు.?

ఈ పోటీలలో పురుషుల విభాగం కూడా ఆసక్తికరంగా సాగింది. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచ్ తో తలపడ్డారు. అయితే, ఈ మ్యాచ్ మూడు సార్లు గేమ్ డ్రాగా ముగిసింది. ఫలితంగా, ఇద్దరు ఆటగాళ్లు టైటిల్‌ను పంచుకోవాల్సి వచ్చింది. మొత్తానికి వైశాలి సాధించిన కాంస్య పతకం భారత చెస్ క్రీడకోసం ఎంతో కీలకమైన విజయంగా నిలిచింది. ఈ విజయంతో ఆమె తన ప్రతిభను మరింతగా ప్రపంచానికి చాటుకుంది. మరోవైపు, కోనేరు హంపి కూడా ర్యాపిడ్ ఈవెంట్‌లో టైటిల్ గెలిచిన విషయం గర్వకారణం. ఈ విజయాలు భారత చెస్ క్రీడను ప్రపంచ మాధ్యమాలలో మెరుగైన గుర్తింపు పొందించే దిశగా ముందడుగు వేసినట్లు చెప్పవచ్చు. ఈ విజయాలతో భారత చెస్ క్రీడా ప్రపంచంలో తన స్థాయిని మరింత పెంచుకుంటూ, కొత్త తరానికి ప్రేరణని ఇచ్చింది.

Show comments