ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అన్ని కలిసొస్తున్నాయి. ఇప్పటికే దేశవాళీ క్రికెట్, టీమ్ఇండియా అండర్-19లో అవకాశం దక్కించుకున్న అతడు ఇప్పుడు ఏకంగా భారత్ ఏ స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వైభవ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసి (101; 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ ఇన్నింగ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఐపీఎల్ అనే కాదు.. ఎక్కడ ఆడినా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. సింగిల్స్ తీసినంతా ఈజీగా.. సిక్సర్లు బాదేస్తూ రన్స్ చుస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఏ స్క్వాడ్‌లోకి దూసుకొచ్చాడు. ఈ విషయం తెలిసి అందరూ అతడికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ‘లక్కంటే నీదేనయ్యా’ అంటూ కామెంట్స్ నెటిజెన్స్ పెడుతున్నారు.
భారత్ ఏ స్వ్కాడ్:
ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేర, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జే, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, హర్ష్ దూబె, అశుతోశ్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్రీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాంశ్ శర్మ.
