Vaibhav Suryavanshi: బేబీ బాస్‌ను మెచ్చిన యూనివర్సల్ బాస్.! సిక్సర్ల మెషిన్ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువ ఓపెనర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి SRH బౌలర్లకు కాల రాత్రిని ముగించాడు.
వైభవ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. అయితే శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఆగిపోయినా.. వైభవ్ బ్యాటింగ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను, దిగ్గజాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టడం సంచలనంగా మారింది.
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
2015లో క్రిస్ గేల్ 59 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును వైభవ్ ఈ సీజన్లో 65 సిక్సర్లు బాది అధిగమించాడు. దీంతో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ సోషల్ మీడియా వేదికగా యువ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. “వైభవ్ అసాధారణమైన ఆటగాడు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు యంగ్ మ్యాన్..! న్యూ సిక్స్ మెషిన్” అంటూ గేల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
What a phenomenal player Vaibhav is. Great entertainment young man! New Six machine @IPL pic.twitter.com/ofElAousF7
— Chris Gayle (@henrygayle) May 27, 2026
ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్.. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే తన లక్ష్యమని చెప్పాడు. “ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అయిన విషయం మ్యాచ్ ముగిసిన తర్వాతే తెలిసింది. నా దృష్టంతా సిక్సర్లు కొట్టి జట్టుకు ఎక్కువ పరుగులు అందించడంపైనే ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సెంచరీలు వస్తాయి” అని తెలిపాడు. అలాగే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వైభవ్ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. “చిన్ అప్ బాయ్.. ఏ క్లాస్ ఇన్నింగ్స్ ఆడావ్. నీ బ్యాటింగ్ అందరి ఊపిరి ఆపేసింది” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Chin up boy 👏🏼 what a CLASS
inning, you've taken everyone's breath away. Star in the making ⭐️ pic.twitter.com/rgkq98SbPg— Surya Kumar Yadav (@surya_14kumar) May 27, 2026
మరోవైపు వైభవ్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచినా.. రాజస్థాన్ విజయంలో జోఫ్రా ఆర్చర్ పాత్ర కూడా కీలకమైంది. పవర్‌ప్లేలోనే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కీలక వికెట్లు తీసి SRHను భారీ ఒత్తిడిలోకి నెట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు కేవలం 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి