Site icon NTV Telugu

Vaibhav Suryavamshi: అప్పుడే ప్ర‌మోష‌న్‌.. వైస్‌ కెప్టెన్‌గా వైభ‌వ్‌ సూర్యవంశీ!

Vaibhav Suryavamshi Bihar

Vaibhav Suryavamshi Bihar

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్ర‌మోష‌న్‌ దక్కింది. బీహార్ టీమ్‌ వైస్ కెప్టెన్‌గా వైభ‌వ్‌ను బీహార్ క్రికెట్ అసోయేషిన్ (బీసీఎ) ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌కు గాను బీహార్ వైస్ కెప్టెన్‌గా వైభ‌వ్‌ వ్యవహరించనున్నాడు. ప్ర‌తిష్టాత్మ‌క దేశవాళీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కోసం బీసీఎ సెల‌క్ట‌ర్లు సోమ‌వారం 15 మందితో కూడిన బీహార్ జ‌ట్టును ప్ర‌క‌టించారు. సాకిబుల్ గని జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

పియూష్ కుమార్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, హిమాన్షు సింగ్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు బీహార్ జ‌ట్టులో ఉన్నారు. రంజీ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేయడానికి బీహార్ రాష్ట్రంలో సెలెక్టర్లు లేరని నిన్నటివరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నెపథ్యంలోనే జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఆల‌స్యం అయిన‌ట్లు సమాచారం. ఇక బిహార్ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబ‌ర్ 15న అరుణాచల్ ప్ర‌దేశ్‌తో ఆడనుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు విజయాన్ని అందించిన వైభవ్ సూర్యవంశీ పైనే బీహార్ ఆశలు పెట్టుకుంది.

వైభవ్ సూర్యవంశీ 12 ఏళ్ల వయసులోనే రంజీలో అరంగేట్రం చేశాడు. భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు త‌ర‌పున మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసి అందరి దృష్టిలో పడ్డాడు. 14 ఏళ్లకే ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్ తరఫున ఆడి 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆపై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు. దీంతో ఇప్పుడు ఏకంగా రంజీ ట్రోఫీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైభవ్ జోరు చూస్తుంటే త్వరలోనే టీమిండియాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: SAW vs BANW: భారత్ మ్యాచ్ సీన్ రిపీట్.. ఉత్కంఠ పోరులో బంగ్లాపై దక్షిణాఫ్రికా విజయం!

బిహార్ జట్టు:
పీయూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సకీబుల్ గని (కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్‌), అర్నవ్ కిషోర్, ఆయుష్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఖలిద్.

 

 

Exit mobile version