Vaibhav Sooryavanshi: ‘నన్నెందుకు తీసుకొచ్చారో చెప్పండ్రా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ మొత్తం తిప్పడానికా’..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో తుది జట్టులో అవకాశం దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వరుసగా మ్యాచ్‌లు జరుగుతున్నా బెంచ్‌కే పరిమితం కావడంతో, అభిమానులు అతడి పరిస్థితిపై నెట్టింట భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు, మీమ్ క్రియేటర్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా మీమ్స్, ఫన్నీ ట్రోల్స్ ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్‌కు కనీసం అరంగేట్రం చేసే అవకాశం కూడా రాలేదు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనైనా అతడు బరిలోకి దిగుతాడని అభిమానులు ఆశించారు. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లోనూ అతడికి నిరాశే ఎదురైంది. నేడు జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమేననే సంకేతాలు వస్తుండటంతో నెటిజన్లు మరింతగా స్పందిస్తున్నారు.
Also Read
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ మనోగతం ఇలా ఉందంటూ క్రియేట్ చేసిన ఫన్నీ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. “నన్ను ఎందుకు సెలెక్ట్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చార్రా? కేవలం ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలన్నీ చుట్టేసి చూపించడానికేనా?” అంటూ వైభవ్ స్వయంగా బీసీసీఐ, సెలెక్టర్లు, జట్టు కెప్టెన్‌ను నిలదీస్తున్నట్లుగా ఉన్న వ్యంగ్య పోస్టులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
సాధారణంగా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను భవిష్యత్తు అవసరాల కోసం విదేశీ పర్యటనలకు తీసుకెళ్లడం, అక్కడ సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం కల్పించడం భారత క్రికెట్లో ఒక ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల వారికి అంతర్జాతీయ మ్యాచ్‌ల వాతావరణంపై అవగాహన వస్తుంది. అయితే, వరుసగా అన్ని మ్యాచ్‌ల్లోనూ కేవలం బెంచ్‌కే పరిమితం చేసినప్పుడు అభిమానుల నుంచి ఇలాంటి స్పందన రావడం సహజం. వైభవ్ సూర్యవంశీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఫన్నీ ట్రోల్స్‌ను ఎంజాయ్ చేస్తూనే, తదుపరి మ్యాచ్‌ల్లోనైనా అతడికి దేశం తరఫున ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?