Vaibhav Sooryavanshi Records: పిట్ట కొంచెం.. కూత ఘనం.. అన్నట్లుగా ఉంది వైభవ్ సూర్యవంశీ వ్యవహారం. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడుతూ “బేబీ బాస్”గా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి SRH బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ విధ్వంస ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు ఉండగా.. 334.48 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు చేరుకుంది.
* ఈ మ్యాచ్‌తో వైభవ్ వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఎన్నో రికార్డులను అధిగమించాడు. 2012 ఐపీఎల్ సీజన్‌లో గేల్ కొట్టిన 59 సిక్సర్ల రికార్డును వైభవ్ ఈ సీజన్‌లో 65 సిక్సర్లు బాది చెరిపేశాడు. దీంతో ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు.
* ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 12 సిక్సర్లు కొట్టిన వైభవ్.. 2023లో ముంబై ఇండియన్స్‌పై శుభ్‌మన్ గిల్ కొట్టిన 10 సిక్సర్ల రికార్డును అధిగమించాడు.
* ఈ సీజన్‌లో పవర్‌ప్లేలోనే వైభవ్ 490 పరుగులు చేయడం మరో సంచలనం. ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అతడు నిలిచాడు.
* ఒక ఐపీఎల్ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసిన తొలి టీనేజర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.
* అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ వైభవ్ కొత్త చరిత్ర రాశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 2023లో యశస్వి జైస్వాల్ చేసిన 626 పరుగుల రికార్డును అధిగమించి ప్రస్తుతం 680 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.
* ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. ఐపీఎల్ ప్లేఆఫ్/నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సురేష్ రైనాతో సమం చేశాడు.
* ఒక ఇన్నింగ్స్‌లో మూడుసార్లు 10కి పైగా సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కూడా వైభవ్ నిలిచాడు. అంతేకాదు.. మొత్తం టీ20 క్రికెట్‌లో నాలుగు సార్లు 10కిపైగా సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు.
* సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పవర్‌ప్లేలోనే 8 సిక్సర్లు బాదిన వైభవ్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా మరో అరుదైన ఘనత సాధించాడు.
We are out of words 👏👏
9⃣7⃣(29) of absolute force from Vaibhav Sooryavanshi 🔥🔥
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/gtt63Wwkx1
— IndianPremierLeague (@IPL) May 27, 2026
Vaibhav Sooryavanshi’s mantra: think less, deliver more 🔥
A record-breaking night as Rajasthan Royals move one step closer to their title dream.🩷#TATAIPL 2026 Qualifier 2 👉 #GTvRR | FRI, 29th MAY, 6:30 PM pic.twitter.com/z7sjQuhVM6
— Star Sports (@StarSportsIndia) May 27, 2026
