Site icon NTV Telugu

Bhagavanth Kesari : భగవంత్‌ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్..

Whatsapp Image 2023 11 05 At 10.47.41 Am

Whatsapp Image 2023 11 05 At 10.47.41 Am

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి నేటి వరకు కలెక్షన్ల విషయంలో బాలయ్య జోరు చూపించాడు… తాజాగా భగవంత్ కేసరి 15 రోజుల వరల్డ్‌వైడ్‌గా రూ.135.73 కోట్లు వసూళ్లు రాబట్టింది. మూడో వారంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రేక్షకులతో థియేటర్స్ సందడిగా మారింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్‌డేట్ ను ఇచ్చారు.ఈ సినిమా నుంచి హార్ట్ టచింగ్ మెలోడీ ఉయ్యాలో ఉయ్యాలా అనే సాంగ్‌ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఉడతా ఉడతా హుష్షా హుష్‌.. సప్పుడు సేయకుర్రీ.. నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ’ ఉయ్యాలో ఉయ్యాలా.. అంటూ తెలంగాణ యాసలో సాగిన ఈ పాటను అనంత శ్రీరామ్‌ లిరిక్స్ అందించగా ప్రముఖ సింగర్ యస్‌.పి.చరణ్‌ ఈ పాటను పాడారు..

ఈ చిత్రానికి తమన్‌ అదిరిపోయే మ్యూజిక్ అందించారు…ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ యాక్టర్‌ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్‌గా నటించగా ఆర్‌ శరత్‌కుమార్‌ మరియు రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది నిర్మించారు.బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఎంతగానో మెప్పించాడు.. ప్రస్తుతం బాలయ్య తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తో చేస్తున్నారు. Nbk 109 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ను గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య ను దర్శకుడు బాబీ మరింత కొత్తగా చూపించనున్నాడు..

Exit mobile version