NTV Telugu Site icon

Bengaluru North University: కాలేజీ పోర్టల్ హ్యాక్.. 60 మంది విద్యార్థుల మార్కులు తారుమారు

Bengaluru North University

Bengaluru North University

Bengaluru North University UUCMS portal Hacked: బెంగళూరు నార్త్ యూనివర్శిటీలోని యూనిఫైడ్ యూనివర్శిటీ అండ్ కాలేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (UUCMS) పోర్టల్‌ లోకి ప్రవేశించి 60 మందికి పైగా ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కులను తారుమారు చేసిన ముఠాను కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. కోలార్ జిల్లాలోని సైబర్ క్రైమ్ & నార్కోటిక్స్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ (CEN) ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. అందులో గిరీష్, సందేశ్, సూర్య అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గిరీష్, సందేశ్ కోలార్‌లోని MNG ప్రీ-యూనివర్శిటీ కళాశాలతో పాటు స్మార్ట్ డిగ్రీ కళాశాలకు ధర్మకర్తలుగా ఉన్నారు. సూర్య ఈ సంస్థల్లో ఒకదానిలో విద్యార్థి. ఈ ఘటనలో అధికారులు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసారు. అలాగే ఈ స్కామ్‌లో అదనపు అనుమానితుల ప్రమేయం ఉండవచ్చని భావిస్తున్నారు.

Read Also: Abhimanyu Iswaran: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా నాలుగో సెంచరీ.. టీమిండియా తలుపు తడుతున్నాడుగా.!

UUCMS పోర్టల్, కర్ణాటక ఉన్నత విద్యా శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఉన్నత విద్యా సంస్థల కార్యకలాపాలను కేంద్రీకరించడానికి, ప్రవేశాలు, పరీక్షలు, డిగ్రీ అవార్డులు, ఇంకా హాజరు రికార్డుల వంటి పనులను నిర్వహించడానికి రూపొందించబడింది. ఓ నివేదిక ప్రకారం, నిందితుడు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తిప్పేస్వామి లాగిన్ ఆధారాలను దుర్వినియోగం చేయడం ద్వారా పోర్టల్‌కు లాగిన్ పొందాడు. మరోవైపు పరీక్ష ఫలితాలను మార్చేందుకు విద్యార్థుల నుంచి రూ.15,000 నుంచి రూ.20,000 వరకు వసూలు చేశారు నిందితులు. బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలో ఓ విద్యార్థి నుంచి డబ్బు వసూలు చేసేందుకు యత్నించిన నిందితుల్లో ఒకరు పట్టుబడడంతో మోసం బట్టబయలైంది. విచారణలో అతడు ఆపరేషన్‌ చేసినట్లు ఒప్పుకున్నాడు.

WPI inflation : పండుగ సీజన్‌లో షాకిచ్చిన ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్‌లో ఎంత పెరిగిందంటే ?

బెంగుళూరు నార్త్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ఫెయిల్ అయిన విద్యార్థుల రికార్డులను యాక్సెస్ చేయడానికి UUCMS వెబ్‌సైట్‌ లోని బలహీనతలను ఉపయోగించుకుని, పాస్‌వర్డ్‌ లను రీసెట్ చేసిందని తదుపరి విచారణలో వెల్లడైంది.