Site icon NTV Telugu

Ankita Bhandari Case: అంత్యక్రియలకు అంకిత తల్లిదండ్రులు ససేమిరా.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!

Ankita Bhandari Case

Ankita Bhandari Case

Ankita Bhandari Case: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్యకేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మాజీ మంత్రి వినోద్‌ ఆర్య కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఈ కేసుకు సంబంధించి వాట్సప్ చాట్‌లపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు పుల్కిత్‌ ఆర్య బాధితురాలి స్నేహితుడిని కూాడా తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించాడు.

యువతి మిత్రుడిని తప్పుదోవ పట్టించే యత్నం: ఈ కేసులో నిందితుడు పుల్కిత్‌ ఆర్య సదరు యువతి మిత్రుడైన పుష్ప్‌ను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినట్లు తేలింది. ఈ మేరకు పుల్కిత్‌ కాల్‌ రికార్డింగ్‌లు వెలుగు చూశాయి. వీటిల్లో ఒక సారి పుష్ప్‌తో మాట్లాడుతూ ‘‘మేము అంకితతో కలిసి రిషికేశ్‌కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి రిసార్ట్‌కు వచ్చాము. అంకితా మాతో కలిసి డిన్నర్‌ కూడా చేసింది. కానీ, మర్నాడు ఉదయం నుంచి ఆమె గది నుంచి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నాం’’ అని పేర్కొన్నాడు. మరో కాల్‌లో పుల్కిత్‌ ఏకంగా పుష్ప్‌పైనే అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ కాల్‌లో పుల్కిత్‌ మాట్లాడుతూ ‘‘అంకిత నీ వద్ద ఉందా..? ఆమె ఎప్పుడూ నీగురించి మాట్లాడుతుంటుంది’’ అని అడిగాడు. దీనికి పుష్ప్‌ సమాధానం చెబుతూ ‘‘నేను చాలా దూరంలో ఉన్నాను. మీ వద్ద ఉన్న ఆమె ఇంత దూరం ఎలా వస్తుంది. ముందు మీరు ఆమె కోసం వెతకండి.. లేకపోతే సమస్యల్లో చిక్కుకొంటారు’’ అని హెచ్చరించాడు. వాస్తవానికి హత్య జరిగిన రోజు పుష్ప్‌కు రాత్రి 8.30 కాల్‌ చేస్తానని అంకిత పేర్కొంది. కానీ, ఫోన్‌ రాకపోవడంతో అతడే పుల్కిత్‌, అంకిత, భాస్కర్‌కు ఫోన్లు చేశాడు.

అంత్యక్రియలకు నిరాకరణ: ఇదిలా ఉండగా అంకితా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వాహించేందుకు నిరాకరించారు. ఆమె పోస్ట్‌మార్టం రిపోర్టు అప్పగించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టారు. ఐతే నిందితులు ఇలాంటి తప్పులు చేసేందుకు భయపడేలా వారి రిసార్టును కూల్చివేయాల్సిందిగా సీఎం ధామీ పుష్కర్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయమై అంకితా తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిసార్ట్‌ కూల్చివేతతో కీలక ఆధారాలు మాయమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇలా ఎందుకు చేశారంటూ ఉత్తరాఖండ్‌​ ప్రభుత్వాన్ని నిలదీశారు. రిసార్టుపై ప్రతి అంశాన్ని దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. అయితే అంకితా కుటుంబీకులు మాత్రం అంత్యక్రియలు చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేగాదు ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

UN Security Council: ఐక్యరాజ్యసమితిలో మరోసారి భారత్‌కు మద్దతుగా నిలిచిన రష్యా

నా కుమారుడు సాధారణ యువకుడు: మరోవైపు నిందితుడి తండ్రి వినోద్‌ ఆర్య తన కుమారుడు పుల్కిత్‌ ఆర్యపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చాడు. తన కుమారుడు సాధారణ యువకుడని పేర్కొన్నాడు. అతడికి ఎప్పుడూ వ్యాపారంపైనే ధ్యాస అని వివరించాడు. పుల్కిత్‌, అంకిత ఇద్దరికీ న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు వివరించాడు. అతను తమ నుంచి వేరుగా జీవిస్తున్నాడని పేర్కొన్నారు.

Exit mobile version