Site icon NTV Telugu

Uttarakhand : కేదార్‌నాథ్‌లో దారుణం.. గుర్రానికి బలవంతంగా గంజాయి..ఆపై..

Uttarakhand

Uttarakhand

మనుషులు రాను రాను మృగాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.. మూగ జీవాలపై దారునాలకు ఒడి గడుతున్నారు.. తాజాగా ఉత్తరాఖండ్ లో అత్యంత దారుణ సంఘటన వెలుగు చూసింది.. కేదార్‌నాథ్ నడక మార్గంలో గుర్రపు ఆపరేటర్లు మూగ జీవుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు.. గుర్రానికి సిగరెట్‌లో డ్రగ్స్ కలిపి బలవంతం గా ముక్కు, నోటి గుండా పొగ పట్టిస్తున్నారు. తాజాగా గుర్రపు నిర్వహకులు జంతువులకు డ్రగ్స్ తో ఉన్న సిగరెట్లను పట్టిస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. ఈ వీడియోలను చూసిన వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు.. వారందరిని ఉరి తీయ్యాలని డిమాండ్ చేస్తున్నారు..

పవిత్ర కేదార్‌నాథ్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ ధామ్‌కి చేరుకోవడాని కి వివిధ మార్గాలున్నాయి. కేదార్‌నాథ్ ధామ్ ప్రయాణం కష్టతరమైన ప్రయాణంగా పరిగణించబడుతుంది. వాహనాల ద్వారా గౌరీకుండ్‌కు చేరుకున్న తర్వాత.. దాదాపు 18 కిలో మీటర్ల ఎత్తు పైకి వెళ్లేందుకు కాలినడకన లేదా గుర్రాల ద్వారా చేరుకుంటారు. తిరిగి వచ్చే సమయానికి కూడా ఇదే ప్రక్రియ. ఈ తరుణంలో గుర్రాలకు అలసట రాకూడదని వాటి యాజమానులు జంతువుల పట్ల క్రూరత్వంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్బంలో రెండు వేర్వేరు వీడియోలు వైరల్ అవ్వడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఆ వీడియోలో ఇద్దరు గుర్రాల నిర్వాహకులు గుర్రం నోటిలో గంజాయి పెట్టారు. ఆ తరువాత వారు దాని నోరు, ముక్కును గట్టిగా మూసారు. వారి వికృత చర్యకు పాపం ఆ మూగజీవి ఉక్కిరిబిక్కిరైంది. కానీ.. ఆ తర్వాత ఆ గుర్రం గంజాయిని పీల్చటం కనిపించింది. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చేశారు. ఇలా గుర్రాని కి గంజాయి అలవాటు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది..ఈ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి వారందరిని అరెస్ట్ చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version