NTV Telugu Site icon

HIV: జైల్లో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్

Hiv

Hiv

ఉత్తరాఖండ్ లోని హల్ద్ వాని జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతుంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 44 మందికి హెచ్ఐవీ సోకినట్లు నిర్థారణ అయింది. వారిలో ఒక మహిళ కూడ ఉండటం గమనార్హం. బాధితుల కోసం అక్కడే ఏఆర్టీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సుశీలా తివారీ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పరమ్ జిత్ సింగ్ వెల్లడించారు. వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే హెచ్ఐవీ సోకినావారంతా డ్రగ్స్ బానిసలేనని పోలీసులు తెలిపారు. హల్ద్ వాని జైలులో ఉన్న 44 మంది ఖైదీల్లో హెచ్ఐవీ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. చాలా మంది సోకిన ఖైదీలు ఎన్డీపీఎస్ చట్టం కింద ఉంచబడ్డారు. సునీల తివారీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హల్ద్ వాని సబ్ జైలులో 1673 మంది ఖైదీలు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు చేసి సంబంధిత వ్యాధులకు మందులు పంపిణీ చేస్తుంటారు.

Also Read : CPI Narayana: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ సర్కారుకు సీపీఐ మద్దతు

అయితే ఇటీవల సబ్ జైలులోని ఆరోగ్య పరీక్షల శిభిరంలో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో జైలు పాలకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. విచారణలో వెలుగులోకి వచ్చిన వారిలో 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఖైదీలు ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. జైలు పరిపాలన ప్రకారం.. ఇప్పటికే చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోకిన వారిని తుదపరి బ్యాకర్ లో ఉంచినట్లు ఇన్ చార్జ్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు. వైద్య సలహాతో వారికి మందులు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. జైలు బయట ఇంజక్షన్లు వేసుకుని మత్తులో కూరుకుపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఒకే సిరంజితో చాలా మంది మత్తులో ఉండటం ఈ వ్యాధికి కారణమని చెబుతున్నారు. సోకిన వారిలో ఒక మహిళా ఖైదీ ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. మహిళా ఖైదీ భర్తకు కూడా హెచ్ఐవీ సోకిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె జైలు నుంచి బయటకు వచ్చినప్పటికీ మహిళ సబ్ జైలులోనే శిక్ష అనుభవిస్తోంది.

Also Read : IPL 2023: నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా