Shaukat Ali: హిందూ వివాహాలపై ఉత్తరప్రదేశ్ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్య సంచలనం రేపింది. రాష్ట్రంలో ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. మేము మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తామన్నారు. కానీ మీరు (హిందువులు) ఒకరిని వివాహం చేసుకున్నారు.. ముగ్గురితో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారని షాకత్ అలీ వ్యాఖ్యలు చేశారు. మీరు(హిందువులు) మీ భార్యను గౌరవించరు కానీ.. మాకు రెండు పెళ్లిళ్లు జరిగితే వాటిని గౌరవంగా ఉంచుతామని ఆయన హిందూ వివాహాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో ఉంటాయన్నారు.
Street Dogs Solve Mystery: హత్య కేసుని చేధించి.. అవినీతిపరులైన ఖాకీల్ని పట్టించిన వీధి కుక్కలు
హిజాబ్ నిషేధం అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం గురించి కూడా యూపీ ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ మాట్లాడారు. దేశంలో ఎవరు ఏమి ధరించాలో హిందుత్వం నిర్ణయించదు, కానీ రాజ్యాంగం నిర్ణయిస్తుందన్నారు. దేశంలో ఎవరు ఏం వేసుకోవాలో రాజ్యాంగం నిర్ణయిస్తుందని, హిందుత్వం కాదన్నారు. కానీ ఇలాంటి అంశాలను లేవనెత్తడం ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ పనిచేస్తోందని షౌకత్ అలీ ఆరోపించారు. ముస్లింలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ బలహీనంగా ఉన్నప్పుడు వారు ముస్లిం సమస్యలపై దృష్టి సారిస్తారని ఆరోపించారు.