NTV Telugu Site icon

Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి & గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ పై పద్ధతులు/మార్గ దర్శకాలను అధ్యయనం చేయడానికి, అలాగే సిఫార్సు చేయడానికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యపు పునరుద్ధరణ కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయబడింది.

Pawan Kalyan: అందుకే నేత వస్త్రాలను ధరిస్తున్నాను.. కీలక ప్రకటన చేసిన పవన్‌ కళ్యాణ్

ఈ కమిటీలో నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (I&CAD, ఆహారం & పౌర సరఫరాల మంత్రి) ఛైర్మన్ గా, తుమ్మల నాగేశ్వరరావు Thummala Nageswara Rao ( వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి, మరియు హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్ మంత్రి) సభ్యుడుగా., జూపల్లి కృష్ణారావు (ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మంత్రి; టూరిజం & కల్చర్ మరియు ఆర్కియాలజీ మంత్రి) సభ్యుడుగా ఎన్నికయ్యారు. అలాగే ప్రభుత్వ కార్యదర్శి, I&CAD శాఖ, పై క్యాబినెట్ సబ్‌ కమిటీకి సభ్యుడు/కన్వీనర్‌ గా ఉంటారు. ప్రభుత్వం ఈ క్యాబినెట్ సబ్‌ కమిటీని అధ్యయనం చేసి సిఫార్సులను సమర్పించాలి.

Prabhas: రాజువయ్యా.. మహారాజువయ్యా.. ప్రతి ఏటా 100 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు!!

Show comments