NTV Telugu Site icon

Utsavam Review: ‘ఉత్సవం’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా..? రివ్యూ ఎలా ఉందంటే..!

Utsavam

Utsavam

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి కథ అందిస్తూనే దర్శకత్వం వహించిన సినిమా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది.? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది. అనేది రివ్యూలో చూద్దాం పదండి.

ఉత్సవం కథ:
సురభి నాటకాలు ప్రదర్శిస్తూ అనేక అవార్డులు అందుకున్న అభిమన్యు నారాయణ(ప్రకాష్ రాజ్) కుమారుడు అభిమన్యు కృష్ణ(దిలీప్ ప్రకాష్) ఇంజినీరింగ్ చదివి ఎలాంటి ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలాంటి అతన్ని ఏదైనా ఉద్యోగంలో సెట్ చేయాలని అభిమన్యు నారాయణ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు ప్రయత్నించిన కృష్ణ ఆ స్నేహితుడు భార్య స్నేహితురాలు రమ(రెజీనా కసాండ్రా) సహాయంతో ఉద్యోగం సంపాదిస్తాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడని తెలిసిన వెంటనే కృష్ణకు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు అభిమన్యు తండ్రి. పెళ్లికి అంతా సిద్ధం అనుకుంటున్న సమయంలో కృష్ణతో పాటు పెళ్లికూతురు కూడా మిస్ అవుతుంది. అసలు కృష్ణ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఆరిపోయాడు? పెళ్లికూతురు ఎందుకు పారిపోయింది? చివరికి కృష్ణ పెళ్లి జరిగిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమాని ముందు నుంచే నాటక బ్యాక్ గ్రౌండ్ సినిమా అని ప్రమోట్ చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. అయితే అదే నాటక బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఉంది. సురభి నాటక పరిషత్ కేంద్రంగా కథ మొత్తం తిరుగుతుంది. అయితే దానికి ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ జోడించారు. నిజానికి నాటకాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని తెలుగులో కృష్ణం వందే జగద్గురుమ్, రంగ మార్తాండ లాంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాని కూడా పూర్తిగా నాటక కుటుంబాలను స్పృశిస్తూ వచ్చింది. అయితే నాటక సమాజాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నప్పుడు ఇంకా కొన్ని కుటుంబాలు నాటకాలని ప్రధానంగా చేసుకొని ఆదాయం లేకపోయినా బతుకుతున్నట్టు చూపించారు. కానీ ఎందుకు అలా చేస్తున్నారు? వారి పూర్వికులు వారికి ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఎందుకు ఇంకా అలానే చేస్తున్నారు? లాంటి విషయాలను డెప్త్ గా చూపిస్తే బాగుండేది. దర్శకుడు అర్జున్ సాయి ఇలాంటి ఒక పాయింట్ ను కథాంశంగా ఎంచుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే కథగా అనుకున్నది తెరకెక్కించడంలో మాత్రం తడబడ్డాడు. స్క్రీన్ ప్లే విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా వచ్చే సీన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇక కొన్ని సీన్స్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. కొన్ని ఎంగేజ్ చేయడంలో విఫలం అయినట్టే. అర్జున్ సతికి రచయితగా మంచి ఆలోచనలు ఉన్నప్పటికీ.. ఆ ఆలోచనలను దృశ్య రూపకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయంలో తడబడ్డాడు.

నటీనటుల విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో కృష్ణ అనే కుర్రాడు పాత్రలో దిలీప్ ప్రకాష్ ఒదిగిపోయాడు. కన్నడలో ఎప్పుడో ఒక సినిమా చేసినా సరే ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో భలే నటించాడు. ఇక రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా సరిగ్గా నప్పింది.. ఒకపక్క అందంగా కనిపిస్తూనే నటనతో కూడా ఆకట్టుకుంది. ఇక ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, అలీ, ఎల్.బి.శ్రీరామ్, ప్రేమ వంటి వాళ్ళు అందరూ కనిపిస్తుంటే ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా కనిపించింది. వారికి అందరికీ మంచి స్కోప్ ఉన్న పాత్రలు పడ్డాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో రసూల్ ఎల్లోర్ మార్క్ సినిమాటోగ్రఫీ చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది. అనూప్ రూబెన్స్ పాటలు కొన్ని బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తికరంగా ఉంది. ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్లీ : ఉత్సవం…అందరికీ ఎక్కే సబ్జెక్ట్ కాదు..
రివ్యూ: 2.25/5