Site icon NTV Telugu

Ustaad Bhagath Singh : ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Whatsapp Image 2023 08 08 At 11.34.41 Am

Whatsapp Image 2023 08 08 At 11.34.41 Am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఇప్పుడు రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించి ఈ ఏడాది షూటింగ్ మొదలు పెట్టారు.అయితే అలా షూటింగ్ మొదలు అయ్యి ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి కాగా వెంటనే సినిమా మళ్ళీ వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది..అయితే తాజాగా ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తలపై తాజాగా చిత్ర నిర్మాత స్పందించారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ వేడుక నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి కూడా మాట్లాడటం జరిగింది.. ఈ సినిమా ఆగిపోలేదని అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని వారు తెలిపారు.అలాగే సినిమా విడుదల పై కూడా స్పందించారు.. వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ లేదంటే సమ్మర్ కు కానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని వారు తెలియజేశారు.దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.. మరి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలు అవుతుందో చూడాలి..ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version