Ustaad Bhagat Singh: ఓజీ లాంటి సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశి ఖన్నా సందడి చేయనున్నారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. తాజాగా ఈ రోజు చిత్రం బృందం పవన్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ సాంగ్ ప్రోమోకి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు.
READ ALSO: FIFA World Cup 2026 Schedule: ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పోటీలో 48 దేశాలు.. 16 వేదికలు
తాజాగా చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ఎనర్జిటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. తమ అభిమాన నటుడి కొత్త సినిమా పోస్టర్ రావడంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సాంగ్‌లో పవన్ నుంచి అభిమానులు సూపర్ డాన్స్‌ను ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఏడాదిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
READ ALSO: Deepinder Goyal: మిస్టరీ పరికరంపై జొమాటో సీఈఓ సంచలన పోస్ట్..
Presenting the POWER STAR you loved, hailed and whistled for.
Now with more energy, unmatched attitude and blasting moves 🕺🏻🔥💥#UstaadBhagatSingh first single promo out on December 9th at 6.30 PM ❤🔥Our CULT CAPTAIN @harish2you's feast with ROCKSTAR @ThisIsDSP's musical… pic.twitter.com/KE52AGk8Vv
— Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2025
