Rupee vs Dollar: డాలర్‌తో రూపాయి మళ్లీ బలహీనం.. ఆల్ టైమ్ లో 95.45 వద్ద పతనం.. ప్రధాన కారణాలు ఇవే
- రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి
- డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95.45 బలహీనపడింది
- ఆయిల్ ధరలు పెరగడం.. మిడిల్ ఈస్ట్ యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95.45 బలహీనపడింది. మార్చి 30, 2026 (సోమవారం) ఉదయం ట్రేడింగ్‌లో USD/INR జత ఆల్-టైమ్ హైగా 95.45 స్థాయిని మళ్లీ తాకింది. గత శుక్రవారం (మార్చి 27) ఇప్పటికే 95.45 అనే కొత్త రికార్డు హైని సాధించిన ఈ జత, RBI చర్యల వల్ల సోమవారం ఉదయం 94.00 సమీపంలోకి బలపడి (రూపాయి ఎర్లీ గెయిన్స్) కనిపించింది. కానీ ఆ తర్వాత ఆ గెయిన్స్‌ను గివ్ బ్యాక్ చేసి మళ్లీ 95.45 వరకు స్లంప్ అయింది అంటే రూపాయి మళ్లీ బలహీనపడింది. ఇది రూపాయికి ఆల్-టైమ్ లో అత్యంత బలహీన స్థాయి.
RBI చర్యలు & తక్షణ ప్రభావం
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
గత శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కొత్త నిబంధనలు విధించింది. బ్యాంకులు ఫారిన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్‌లో నెట్ ఓపెన్ రూపీ పొజిషన్స్ ను $100 మిలియన్ కి పరిమితం చేయాలని (ఏప్రిల్ 10 నుంచి అమలు) ఆదేశించింది. దీని వల్ల సోమవారం ఉదయం USD/INR 1%+ పడిపోయి 94.00 సమీపంలోకి వచ్చింది. కానీ ఈ ప్రభావం తాత్కాలికం మాత్రమే అని మార్కెట్ ఎక్స్‌పర్టులు చెప్తున్నారు.
ప్రధాన కారణాలు
ఆయిల్ ధరలు పెరగడం.. మిడిల్ ఈస్ట్ యుద్ధం (ఇరాన్-ఇజ్రాయెల్-USA ఉద్రిక్తతలు) వల్ల WTI ఆయిల్ ధర $102.50 వరకు పెరిగింది (+2.5%). USA గ్రౌండ్ ఇన్వేజన్ భయాలు, ఇరాన్ బెదిరింపులు కారణం. ఇండియా ఆయిల్ దిగుమతులపై ఆధారపడటం వల్ల రూపాయి బలహీనపడుతోంది.
FII అవుట్‌ఫ్లోలు.. మార్చి నెలలో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.1,11,376 కోట్లు నెట్ సెల్లర్స్‌గా మారారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల సేఫ్-హేవెన్ డాలర్ డిమాండ్ పెరిగింది. డాలర్ బలం.. గ్లోబల్ అనిశ్చితి, US ఎకనామిక్ డేటా (NFP, ISM PMI) వచ్చే వారం డాలర్ ఇండెక్స్ బలపడుతోంది. మార్చి 27న రూపాయి 94.78 – 94.84 వరకు రికార్డు లో తాకింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 10%+ డిప్రిసియేషన్. ఇది 2011-12 తర్వాత అత్యంత ఘోరమైన ఫిస్కల్ ఇయర్ డ్రాప్ కావచ్చు అని ఎనాలిస్టులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!