USA T20 World Cup Squad 2026: టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని టీంలు తమ ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. తాజాగా యూఎస్‌ఏ టీం మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత ప్రపంచకప్‌లో ఆడిన 15 మందిలో 10 మంది ఈసారి ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అంటే గత అనుభవాన్ని ఈసారి పూర్తిగా ఉపయోగించుకోవాలన్నదే అమెరికా ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అదేంటంటే.. ఈ జట్టు కెప్టెన్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. కెప్టెన్ మోనాంక్ దిలీప్‌భాయ్ పటేల్ భారతదేశంలో జన్మించిన అమెరికన్ క్రికెటర్. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. మోనాంక్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వికెట్ కీపర్ గా 2019లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ అమెరికన్ క్రికెట్ వృద్ధిలో కీలక వ్యక్తిగా నిలిచాడు. అతని నాయకత్వంలో, USA 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై గ్రూప్-స్టేజ్ విజయంతో సహా మైలురాయి విజయాలను నమోదు చేసింది.
READ MORE: Raipur Central Jail: ఆ కేసులో అరెస్టైన ప్రియుడు.. జైలుకెళ్లి సర్ ప్రైజ్ చేసిన ప్రియురాలు..
అయితే.. ఈ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌నే అమెరికాకు పెద్ద పరీక్షగా మారనుంది. ముంబయిలో జరిగే తొలి మ్యాచ్‌లో సహా ఆతిథ్య దేశం, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్‌తోనే అమెరికా తలపడుతుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అమెరికా క్రికెట్ విషయంలో గత ఏడాది ఒక పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఐసీసీ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిందన్న కారణంతో సెప్టెంబర్ 23న ఐసీసీ, యూఎస్‌ఏ క్రికెట్‌ను సస్పెండ్ చేసింది. దాంతో ఈసారి జట్టు ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఐసీసీతో పాటు యూఎస్ ఒలింపిక్ అండ్ ప్యారాలింపిక్ కమిటీ కలిసి ఒక కొత్త ఎంపిక విధానాన్ని రూపొందించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా, పూర్తిగా ప్రతిభ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. ఎంపిక కమిటీ సభ్యులు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని ముందే ప్రకటించగా, ప్రత్యేక అధికారి ఈ ప్రక్రియను పర్యవేక్షించాడు. గత ప్రపంచకప్‌లో అమెరికా చేసిన ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. పూర్తి సభ్య దేశమైన పాకిస్థాన్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, సూపర్ ఎయిట్ దశకు కూడా చేరింది. అదే ధైర్యంతో ఈసారి కూడా బరిలోకి దిగుతోంది.
అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (సి), జెస్సీ సింగ్ (విసి), ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, సౌరభ్ నేత్రవల్కర్, మోహూభ్‌ఖాంస్, రంజనే
