NTV Telugu Site icon

Navneet Dhaliwal: అమెరికా, కెనడా మ్యాచ్.. తొలి హాఫ్‌ సెంచరీ మనోడిదే!

Navneet Dhaliwal India

Navneet Dhaliwal India

Navneet Dhaliwal First Batter To Hit 1st Half Century in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో మొదటి సమరం జరుగుతోంది. అమెరికా, కెనడా జట్ల మధ్య ఈరోజు ఉదయం 6 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. డలాస్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. నవనీత్‌ ధాలివాల్‌ (61; 44 బంతుల్లో 6×4, 3×6), నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయాస్ మొవ్వ (32), ఆరోన్ జాన్సన్ (23) పర్వాలేదనిపించారు. యూఎస్‌ఏ బౌలర్లలో అలీ ఖాన్‌, హర్మీత్‌ సింగ్‌, కోరె ఆండర్సన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో కెనడా ఓపెనర్ నవనీత్‌ ధాలివాల్‌ అద్భుత ఇనింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 61 పరుగులు చేశాడు. దాంతో టీ20 ప్రపంచకప్‌ 2024లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా నవనీత్‌ రికార్డు సాధించాడు. అంతేకాదు పొట్టి టోర్నీలో తొలి సిక్స్ బాదిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే నవనీత్‌ భారత్‌కు చెందిన వాడు కావడం గమనార్హం. 1988 అక్టోబరు 10న పంజాబ్‌లోని చండీగఢ్‌లో నవనీత్‌ జన్మించాడు. అనంతరం కెనడాకు అతడు మకాం మార్చాడు. 35 ఏళ్ల నవనీత్‌ గతంలో కెనడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్స్ ఇవే.. అత్యంత నిలకడైన జట్టు పాకిస్తాన్!

నవనీత్‌ ధాలివాల్‌ కెనడా జట్టు తరఫున 7 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 133 రన్స్ చేయగా.. అత్యధిక స్కోర్ 50. టీ20 మ్యాచ్‌లలో 870 పరుగులు చేయగా.. అత్యధిక స్కోర్ 69 నాటౌట్. పొట్టి ఫార్మాట్‌లో నవనీత్‌ 6 హాఫ్ సెంచరీలు బాదాడు. 36.2 యావరేజ్, 131.0 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మొదటి మ్యాచ్ లోనే అందుకునాడు.

Show comments