US visa Interview Rules 2025: అమెరికా కల అనేది రానురాను చెదిరిపోతుంది. వాస్తవానికి యూఎస్ వీసా ఇంటర్వ్యూ అనేదే కఠినతరమైంది.. అలాంటి తాజాగా దానిని మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా అన్ని వలస వీసా దరఖాస్తుదారులను వారికి నియమించిన కాన్సులర్ జిల్లాలో లేదా వారి జాతీయత ఉన్న దేశంలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిర్దేశించింది. దీనికి పరిమిత మినహాయింపులు కూడా ఇచ్చింది.
READ ALSO: Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ సన్మానం..
నవంబర్ 1 నుంచి మరింత కఠినతరం..
యూఎస్ వీసా అనేది నవంబర్ 1, 2025 నుంచి మరింత కఠినతరం కానుందని తాజా ఉత్తర్వులు స్పష్టం చేశాయి. యూఎస్ నేషనల్ వీసా సెంటర్ వలస వీసా దరఖాస్తుదారులకు వీసా ఇంటర్వ్యూలు వారి నివాస దేశంలో లేదా జాతీయత ఉన్న దేశంలో షెడ్యూల్ చేస్తుందని తెలిపింది. సాధారణ వీసా కార్యకలాపాలు నిలిపివేసిన లేదా పాజ్ చేసిన దేశాల నివాసితులు వలస వీసా ప్రాసెసింగ్‌ను పోస్ట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
వలసేతర వీసా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునే ప్రదేశం.. వారి నివాస స్థలంపై ఆధారపడి ఉంటే, కచ్చితంగా వారు దరఖాస్తు చేసుకుంటున్న దేశంలో నివాసాన్ని ప్రదర్శించగలగాలని తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ 1 నుంచి వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసే అన్ని వలసేతర వీసా దరఖాస్తుదారుల కోసం స్టేట్ డిపార్ట్‌మెంట్ తన సూచనలను నవీకరించిందని వెల్లడించింది. US వలసేతర వీసాలు (NIV) కోసం దరఖాస్తుదారులు వారి జాతీయత లేదా నివాస దేశంలోని US రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో వారి వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
వలసేతర ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేసుకునే దరఖాస్తుదారులు జాతీయత లేదా నివాస దేశం వెలుపల ఉన్న US రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లో దరఖాస్తులు చేసుకుంటే.. ఇకపై వీసాకు అర్హత సాధించడం మరింత కష్టతరం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి దరఖాస్తులకు వాళ్లు చెల్లించిన రుసుము తిరిగి చెల్లించడం, బదిలీ చేయడం జరగదని పేర్కొన్నారు. అక్టోబర్ 10న US నవీకరించిన వీసా ప్రాసెసింగ్ పోస్టుల జాబితాను విడుదల చేసింది.
తాజా మార్పులు DV-2026 ప్రోగ్రామ్ సంవత్సరంలో డైవర్సిటీ వీసా దరఖాస్తుదారులకు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఉన్న వలస వీసా అపాయింట్‌మెంట్‌లను సాధారణంగా తిరిగి షెడ్యూల్ లేదా రద్దు చేయరు. నేషనల్ వీసా సెంటర్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసిన తర్వాత దరఖాస్తుదారుడి వలస వీసా కేసును కొత్త కాన్సులర్ జిల్లాకు బదిలీ చేయాలనుకుంటే, దరఖాస్తుదారుడు నేరుగా కాకుండా నేషనల్ వీసా సెంటర్ పబ్లిక్ ఎంక్వైరీ ఫారమ్ ఉపయోగించి నేషనల్ వీసా సెంటర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన కాన్సులర్ జిల్లా లేదా జాతీయత ఉన్న దేశం కాకుండా వేరే ప్రదేశంలో ఇంటర్వ్యూ కోసం అభ్యర్థిస్తే, అది దరఖాస్తుదాడి నివాస స్థలం అని నిర్ధారించడానికి లేదా మినహాయింపు ఇవ్వడానికి యూఎస్ జాతీయ వీసా కేంద్రం అదనపు సమాచారాన్ని అడగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కొత్త మార్పులకు మానవతా లేదా వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విదేశాంగ విధాన కారణాల వల్ల మాత్రమే అరుదైన మినహాయింపులు ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
READ ALSO: Rohit Sharma Perth Century: తొమ్మిదేళ్ల క్రితం పెర్త్‌లో హిట్‌మ్యాన్ విజయగర్జన..
