Marko Rubio: ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం అన్నారు. భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసించారు. “భారత్‌కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. వారికి మా సహాయం అవసరం లేదు” అని అన్నారు. G-7 విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత కెనడాలో విలేకరులతో రూబియో మాట్లాడారు. భారత్‌కు తాము సహాయం అందించామన్నారు. కానీ భారత్ ఈ దాడిపై సొంతంగా దర్యాప్తు చేసుకోగలదని భావిస్తున్నట్లు తెలిపారు. వారికి తమ దేశ సహాయం అవసరం లేదన్నారు.
READ MORE: Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విజయ్ ఉండాలి” – రష్మిక ఎమోషనల్ స్పీచ్
మరోవైపు.. మార్కో రూబియోతో భేటీ అంశాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. “G7 FMMలో రుబియోను కలవడం ఆనందంగా ఉంది. ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణనష్టానికి ఆయన సంతాపాన్ని తెలియజేశారు. వాణిజ్యం, సరఫరా గొలుసులపై దృష్టి సారించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాం. ఉక్రెయిన్ వివాదం, మధ్యప్రాచ్యం/పశ్చిమ ఆసియా పరిస్థితి, ఇండో-పసిఫిక్‌పై అభిప్రాయాలను పంచుకున్నాం.” అని జైశంకర్ G7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ట్వీట్ చేశారు.
READ MORE: Delhi Car Blast: వెలుగులోకి మరో వీడియో.. ట్రాఫిక్‌లో ఉండగా ఏం జరిగిందంటే..!
