NTV Telugu Site icon

Odisha Train Accident: హృదయ విదారకం.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బైడెన్‌ దిగ్భ్రాంతి

Joe Biden

Joe Biden

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక వార్త వినగానే తన మనసు చలించిపోయిందని బైడెన్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘‘భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించిన విషాద వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. భారత్‌, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి’’ అని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ అన్నారు.

Read also: Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచంలోని పలు దేశాధినేతలతో సహా ప్రధాన మంత్రులు స్పందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంతాపం ప్రకటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా ప్రపంచ నాయకులు తన ప్రగాఢ సంతాపన్ని వ్యక్తం చేశారు. దాదాపు 298 మందికి పైగా మరణించిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. వారి కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి తమ సంతాపాన్ని తెలిపారు. మూడు రైళ్లకు సంబంధించిన ఈ ప్రమాదం దేశంలోనే అత్యంత ఘోరమైనది మరియు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. 1100 మందికి పైగా గాయపడ్డారు.