US-Iran War: పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ఒప్పందం ముగిసినట్లే? ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ (యుద్ధ విరమణ) ఇప్పుడు పూర్తిగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా రెండోసారి భారీ ఎయిర్‌స్ట్రైక్ చేస్తోంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 1:30 గంటల ప్రాంతంలో, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇరాన్‌లోని ‘బందర్ అబ్బాస్’ నగర తూర్పు ప్రాంతంలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ప్రాంతంలో అమెరికా సైన్యంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ముప్పుగా మారిన ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, కేవలం ఆత్మరక్షణ కోసమే ఈ వైమానిక దాడులు చేసినట్లు ఓ అమెరికా అధికారి రాయిటర్స్‌కు స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ దాడిలో ఇరాన్ ప్రయోగించిన పలు ప్రమాదకరమైన డ్రోన్లను సైతం అమెరికా సైన్యం గాల్లోనే కూల్చేసింది. ఈ అటాక్‌ను ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘ఫార్స్’ కూడా ధృవీకరించింది. పేలుళ్లు జరిగిన వెంటనే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఆకాశంలోకి కాల్పులు జరిపినప్పటికీ, జరిగిన నష్టంపై ఇరాన్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా విచారణ జరుపుతున్నామని మాత్రమే చెప్పారు.
నిజానికి, సోమవారం రోజే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) దక్షిణ ఇరాన్‌లోని మిస్సైల్ లాంచ్ సైట్లతో పాటు సముద్రంలో ల్యాండ్ మైన్స్ అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ నౌకలను అటాక్ చేసి ధ్వంసం చేసింది. తమ సైనికుల రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు సెంటకామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అప్పట్లోనే ప్రకటించారు. అయితే, ఈ దాడులను సీజ్ఫైర్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఇరాన్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, శత్రువుల ఎలాంటి దూకుడుకైనా దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించింది. మరోవైపు, ఒమన్, ఖతార్ దేశాల రాయబారంతో తెరవెనుక శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌పై కఠినమైన దీర్ఘకాలిక ఒప్పందం కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుత శాంతి ప్రతిపాదనలపై తనకు ఏమాత్రం సంతృప్తి లేదని, ఇరాన్‌కు ఒప్పందం ఇష్టమున్నా లేకపోయినా అది తమ షరతులకు లోబడి మాత్రమే జరగాలని, లేదంటే సైనిక బలంతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా ముగించాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, భవిష్యత్తు ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ షిప్పింగ్ రూట్‌ను ఇరాన్, ఒమన్‌లు కలిసి నియంత్రిస్తాయన్న ఇరాన్ వాదనలను ట్రంప్ పూర్తిగా తోసిపుచ్చారు. అంతర్జాతీయ జలమార్గం ఏ పరిస్థితిలోనైనా ప్రపంచ వాణిజ్యం కోసం తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఆ తాత్కాలిక శాంతి ఒప్పందం ఇప్పుడు పూర్తిగా మునిగిపోయేలా కనిపిస్తోంది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!