Site icon NTV Telugu

Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్‌ చిత్రాలు వెలుగులోకి

Fordow

Fordow

ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా మిడ్‌నైట్ హామర్ అనే చారిత్రాత్మక సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో, 7 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు 14 GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను ఇరాన్ అత్యంత సురక్షితమైన అణు స్థావరం అయిన ఫోర్డోపై జారవిడిచాయి. మాక్సర్ నుంచి వచ్చిన తాజా ఉపగ్రహ చిత్రాలు ఫోర్డో ఎగువ శిఖరంపై కనీసం 6 ఆయుధ ప్రవేశ రంధ్రాలు/క్రేటర్‌లను చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇరాన్ భారీ నష్టాలను చవిచూసిందని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైందని అమెరికా పేర్కొంది. ఇరాన్ రక్షణ వ్యవస్థ ఈ స్టెల్త్ విమానాలను గుర్తించలేకపోయింది.

Also Read:Amit Shah: “చర్చలు జరిపేదే లేదు.. ఆయుధాలు విడిచి లొంగిపోండి..” మావోలకు అమిత్‌షా ఛాన్స్..

తాజా మాక్సర్ ఉపగ్రహ చిత్రాలు (20 జూన్ 2025) ఫోర్డో ఎగువ శిఖరంపై 6 పెద్ద గుంతలను చూపిస్తున్నాయి. ఇది GBU-57 MOP బాంబుల ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ రంధ్రాలు యురేనియం సుసంపన్నం జరిగే భూగర్భ సముదాయం పైన నేరుగా ఉన్నాయి. అమెరికా సైన్యం ఫోర్డోతో పాటు మూడు ఇరానియన్ అణు కేంద్రాలపై చాలా విజయవంతమైన దాడి చేసిందని ట్రంప్ అన్నారు. ఫోర్డో ప్లాంట్‌లో ఇరాన్ యురేనియంను 83.7 శాతం స్వచ్ఛతకు సుసంపన్నం చేసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) చెబుతోంది. అణు బాంబును తయారు చేయడానికి మొత్తం 90 శాతం స్వచ్ఛత అవసరం.

Exit mobile version