NTV Telugu Site icon

Urvashi Rautela: అబ్బా.. ఏముంది సామి.. ఊర్వశి కొత్త సాంగ్ చూశారా?

Urvasii

Urvasii

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లల్లో మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఊర్వశి నటించిన ఓ పాట ఇప్పుడు ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తుంది.. ఆ పాట వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు చేసిన ఈ పాట ఇప్పుడు ఓ రేంజులో వ్యూస్ రాబడుతుంది..

ఇక అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.. వాల్తేరు వీరయ్య, స్కంద, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఈ బ్యూటీ స్పెషల్ పెర్ఫార్మెన్స్ కు తెలుగు జనాలు ఫిదా అయ్యారు.. మరో సినిమాలో ఎక్కడ కనిపిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.. స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు.. తన అందం, డ్యాన్స్ తో జనాలను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది..

ఇకపోతే ఒకవైపు వరుస సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చెయ్యడం మాత్రం వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది.. తాజాగా ప్రముఖ సింగర్ యోయో హనీసింగ్ తో కలిసి మ్యూజిక్ వీడియోను చేసింది.. ఆ వీడియో సాంగ్ ఇప్పుడు టాప్ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వ్యూస్ ను రాబట్టింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాల్లో కనిపించబోతుంది.. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో కనిపించబోతుంది..

Show comments