US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Defense Budget 2026: ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా తన రక్షణ బడ్జెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 140 లక్షల కోట్లు) భారీ రక్షణ బడ్జెట్‌ను వైట్ హౌస్ ప్రతిపాదించింది. ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే, ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రక్షణ కేటాయింపుగా రికార్డు సృష్టించనుంది. CNN నివేదికల ప్రకారం.. ఈ ప్రతిపాదిత బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 40 శాతం ఎక్కువ. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా తన సైనిక వ్యూహాలను మార్చుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ నిధులను ప్రధానంగా మూడు అంశాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది.
Also Read
అణ్వాయుధాల ఆధునీకరణ
అత్యాధునిక ఆయుధాల నిల్వలను భారీగా పెంచడం, యూఎస్ నావికాదళాన్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మార్చడం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గోల్డెన్ డోమ్’ క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌తోనే ప్రారంభించనున్నారని సమాచారం. అంతేకాకుండా, దేశం కోసం పోరాడుతున్న సైనికులందరికీ 5 నుంచి 7 శాతం వరకు జీతాల పెంపును కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదనలో చేర్చారు. మరోవైపు జాతీయ అణు భద్రతా పరిపాలన సంస్థ (NNSA)కు కేటాయింపులను 3.5 బిలియన్ డాలర్ల మేర పెంచాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. కొత్త అణ్వాయుధాల అభివృద్ధి, పాత వాటిని ఆధునీకరించడం ద్వారా శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక పంపాలని అమెరికా యోచిస్తోందని సమాచారం.
ఒకవైపు రక్షణకు నిధులు పెంచుతున్న ట్రంప్ ప్రభుత్వం, మరోవైపు సంక్షేమ పథకాలపై చిన్నచూపు చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్షణేతర ఖర్చులలో దాదాపు 10 శాతం ($73 బిలియన్లు) కోత విధించాలని తాజా బడ్జెట్లో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. దీని ప్రభావం ఏయే రంగాలపై పడనుందంటే.. తక్కువ ఆదాయ వర్గాల గృహ ఇంధన సహాయ కార్యక్రమం ($4 బిలియన్లు), నిరాశ్రయులకు ఇచ్చే సబ్సిడీలను రద్దుపై పడనుంది. అలాగే వాతావరణ, స్వచ్ఛ ఇంధన పరిశోధనలకు ఇచ్చే $1 బిలియన్ నిధులను కూడా నిలిపివేయనున్నారు. ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లపై ఇచ్చే $4.2 బిలియన్ల సబ్సిడీని పూర్తిగా రద్దు చేయనున్నారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) నిధుల్లో కూడా $1.4 బిలియన్ల కోత పడనుంది. అయితే మెలానియా ట్రంప్ ఆధ్వర్యంలోని ‘ఫాస్టర్ యూత్ టు ఇండిపెండెన్స్’ ఇనిషియేటివ్ కోసం మాత్రం $5 మిలియన్ల నిధిని ప్రత్యేకంగా కేటాయించారు. వచ్చే రెండు మూడు వారాల్లోనే అమెరికా యుద్ధం నుంచి వైదొలుగుతుందని ట్రంప్ పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ, రక్షణ బడ్జెట్‌ను ఇంత భారీగా పెంచడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. యుద్ధం నుంచి తప్పుకుంటారా లేక యుద్ధం కోసమే సిద్ధమవుతున్నారా అన్న ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతున్నాయి.
READ ALSO: Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!