NTV Telugu Site icon

Urfi Javed: నాకు బట్టలంటే ఎలర్జీ.. అందుకే వేసుకోకుండా తిరుగుతాను

Urfi

Urfi

Urfi Javed: ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను కట్టిపడేసిన నటి. ఉర్ఫీ ప్రతిసారీ డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తుంది. ఉర్ఫీ వేషధారణ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తుంటారు.. కానీ తాను అవేమీ పట్టించుకోదు. కొన్నిసార్లు సైబర్ దాడులు జరిగినప్పుడు ఉర్ఫీ వాటి ప్రతిఘటించేందుకు వెనుకాడదు. ఒక్క రోజు కూడా ఉర్ఫీ ఫోటోలు, వీడియోలు లేకుండా సోషల్ మీడియా ఉండదు. ఇటీవలే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

Read Also: Varasudu : వారసుడు ట్విస్టు.. సినిమాలో మహేశ్ బాబు కీ రోల్

కాగా, ఉర్ఫీ చేసిన బహిరంగ ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనకు బట్టలంటే ఎలర్జీ అని ఉర్ఫీ చెప్పింది. ఈ విషయాన్ని రుజువు చేసే సాక్ష్యాలను కూడా ఉర్ఫీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇది జోక్ కాదని, చాలా తీవ్రమైన సమస్య అని ఉర్ఫీ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కథనాల ద్వారా తనకు బట్టలు అంటే ఎలర్జీ అని ఉర్ఫీ బహిరంగంగా వెల్లడించాడు. ఉర్ఫీ తన బొద్దుగా ఉన్న కాళ్ల చిత్రాలను కూడా పంచుకుంది. చలికాలంలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉందా అని కూడా ఉర్ఫీ అడిగింది.”నా చర్మానికి ఉన్ని బట్టలు అసలు పడవు. నేను వాటిని ఒక్క నిమిషం కూడా ధరించలేను. అంతేకాకుండా శరీరాన్ని మొత్తం కప్పేసే డ్రస్‌లు వేసుకోవడం కూడా నాకు ప్రాబ్లమ్. నిజం చెప్పాలంటే నాకు బట్టలంటేనే అలర్జీ. అందుకే నేను ఇలాంటి బట్టలు వేసుకుంటాను. కావాలంటే మీరే చూడండి. నా చేతులు, కాళ్లపై దద్దుర్లు ఎలా వచ్చయో.”

Read Also: Broke Bottle Head : ‘సల్మాన్ ఖాన్ నా తలపై బాటిల్ పగులగొట్టాడు’.. ప్రియురాలు సోమి అలీ

ఉర్ఫీని ఎక్కువగా బిగ్ బాస్ స్టార్ అని పిలుస్తారు. ఉర్ఫీ అనేక ప్రముఖ టెలివిజన్ షోలు, కొన్ని సీరియల్స్, మ్యూజిక్ వీడియోలలో నటించింది. ఉర్ఫీ విభిన్న శైలిలో దుస్తులను ధరిస్తోంది. బట్టలనే కాదు ఆభరణాలను కూడా ఎంచుకోవడంలో కూడా ఆమె తన ప్రత్యేకతను అనుసరిస్తారు. అయితే దీనిపై తరచూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉర్ఫీ కూడా చాలాసార్లు బాడీ షేమింగ్‌కు గురయ్యారు.

Show comments