NTV Telugu Site icon

Urfi Javed : బ్రేకింగ్ న్యూస్..రోడ్డు మీద ఉర్ఫి జావేద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

Urfi Javed (2)

Urfi Javed (2)

ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ మరియు డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా అందరికీ సపరచితమే.. హౌస్ లో తన బోల్డ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది… అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే ముంబై పోలీసులు ఈ అమ్మడుకు షాక్ ఇచ్చారు.. నడి రోడ్డు మీద అరెస్ట్ చేశారు..

చిత్రచిత్రాల డ్రెస్సులు, రకరకాల వస్తువులతో డ్రెస్సులు, బ్లేడ్లు, కవర్లు, గోనె సంచులు, సిమ్ కార్డులు, తాళ్లు… ఇలా రకరకాల వస్తువులతో డ్రెస్సులు వేస్తూ బాగా ఫేమస్ అయింది. అయితే కేవలం ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కప్పుకుంటూ మిగతా శరీరం అంతా కనపడేలా చాలా బోల్డ్ గా బట్టలు వేసుకొని ఫోటో షూట్ చెయ్యడంతో పాటుగా అలాగే బయటకు వస్తుంది.. జనాలు ఆమెను ఒక వింతగా చూస్తుంటారు..అలా వైరల్ అవ్వడంతో పాటు వివాదాల్లో కూడా నిలిచింది ఉర్ఫీ.

ఉర్ఫి జావేద్ విచిత్ర బోల్డ్ వేషధారణతో పలువురికి ఇబ్బంది కలుగుతున్నా, ఆమెని హెచ్చరించినా, ఆమెపై పోలీసు కేసులు పెట్టినా తాను మాత్రం మారట్లేదు. రోజురోజుకి తన డ్రెస్సింగ్ తో పాటు, తన సోషల్ మీడియా పోస్టులతో వివాదాల్లో, వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా ఓ కొత్త రకం డ్రెస్ వేసుకొని పొద్దున్నే కాఫీ తాగడానికి బయటకి వచ్చింది ఉర్ఫి. బాటమ్ జీన్స్, టాప్ బ్యాక్ మొత్తం కనపడేలా కేవలం ఫ్రంట్ కవర్ అయ్యేలా ఓ లవ్ షేప్ క్లాత్ కట్టుకొని వచ్చింది. అయితే ఏమైందో తెలీదు కానీ కొంతమంది ముంబై మహిళా పోలీసులు రోడ్డు మీదనే ఆమెకు, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..