NTV Telugu Site icon

UPSC Notification 2024: 1056 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..పూర్తి వివరాలివే..

Upsc

Upsc

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1056 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 1,056 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.. ఈ పోస్టులకు అర్హతలు ఏంటో ఒక్కసారి చూద్దాం..

అర్హతలు..

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. 2024లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది..

వయసు..

ఆగస్ట్‌ 1, 2024 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్‌సీ/ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్టంగా ఆరుసార్లు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓబీసీలు తొమ్మిదిసార్లు, ఎస్సీ/ఎస్టీలు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావచ్చు..

ఎంపిక ప్రక్రియ..

సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి మూడంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు..

ముఖ్య సమాచారం…

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 5
ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: 2024 మార్చి 6 – 12 వరకు
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2024, మే 26
మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌ 20 నుంచి అయిదు రోజులు
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

ఈ పోస్టుల పై ఏదైనా సందేహం ఉంటే ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..