Site icon NTV Telugu

UPSC Calendar: 2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..!

Ups

Ups

ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పరీక్షలు మరియు పరీక్షల షెడ్యూల్‌ను వివరిస్తూ 2025కి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను ఆవిష్కరించింది. సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్, సాయుధ దళాలు మరియు మరిన్నింటిని విస్తరించి, క్యాలెండర్ ఔత్సాహిక అభ్యర్థులకు రాబోయే అవకాశాల కోసం రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ అంబాసిడ‌ర్‌గా స్టార్ అథ్లెట్..

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2025లో చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్‌ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను పేర్కొంది. దీనిప్రకారం.. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి మే 25న పరీక్ష నిర్వహించనుంది. అలాగే ఆగస్టు 22 నుంచి ఐదు రోజుల పాటు యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. వీటితో పాటు సీబీఐ (డీఎస్పీ), ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ), సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌డీఏ, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ, మెయిన్‌, సీడీఎస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ తదితర ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ ఈ చార్ట్‌లో పేర్కొంది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: MS Dhoni Alert: ధోని బ‌స్సు ఎక్కడానికి రూ.600 కావాల‌ట‌.. పోస్ట్ వైరల్..

ఇదిలా ఉంటే UPSC ఒక సమగ్ర షెడ్యూల్‌ను అందించినప్పటికీ… నోటిఫికేషన్ తేదీలు, పరీక్షలు ఆయా పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను కూడా యూపీఎస్సీ స్వీకరించనుంది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాలు తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

 

Upsc

Exit mobile version