Site icon NTV Telugu

UPI PIN Change Without Card: కార్డ్ లేకుండా ఇలా మీ UPI పిన్ మార్చుకోండి

Upi

Upi

UPI PIN Change Without Card: ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువయ్యాయి. అత్యంత ప్రాధాన్య చెల్లింపు విధానంగా UPI కొనసాగుతోంది. ఫోన్‌ని తీయండి.. QR కోడ్‌ని స్కాన్ చేయండి లేదా నంబర్‌ను నమోదు చేయండి అంతే UPI పిన్‌ను ఎంటర్ చేయగానే చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. వేళ్లమీద చిటికెలో పని పూర్తవుతుంది. యాప్ ద్వారా ఏదైనా లావాదేవీని ప్రామాణీకరించడానికి.. వినియోగదారు సెట్ చేసిన UPI పిన్ అవసరం. వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాను PhonePe, Paytm, Google Payతో సహా UPI యాప్‌లతో లింక్ చేయాలి. అదే సమయంలో PINని సెటప్ చేయాలి.

UPI పిన్ ట్యాంపర్ అయిందని అనిపిస్తే మీరు Google Pay, BHIM, PhonePeతో సహా UPI యాప్‌లను ఉపయోగించి UPI పిన్‌ని రీసెట్ చేయవచ్చు. అయితే, UPI పిన్‌ని రీసెట్ చేయడానికి తప్పనిసరిగా డెబిట్ కార్డ్ ఉండాలి. ఒకవేళ డెబిట్ కార్డ్ లేకపోతే.. UPI పిన్‌ని మార్చాలనుకుంటే సులభంగా ఎలా చేయాలో తెలుసుకుందాం.

Read Also: Ramappa temple: రామప్ప దేవాలయ వారసత్వ ఉత్సవాలు.. రానున్న సినీ తారలు, కళాకారులు

డెబిట్ కార్డ్ లేకుండా మీ UPI పిన్‌ని మార్చండి:
Step 1: Paytm యాప్‌ని తెరిచి, ప్రొఫైల్ గుర్తపై క్లిక్ చేయండి.
Step 2: UPI & చెల్లింపు సెట్టింగ్‌లపై నొక్కండి.
Step 3: UPI & లింక్డ్ బ్యాంక్ ఖాతాల మెనుని తెరవండి.
Step 4: బ్యాంక్ ఖాతాను ఎంచుకుని, పిన్ మార్చుపై నొక్కండి.
Step 5: అప్పుడు క్రింద నా పాత UPI పిన్ గుర్తుంది అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై నొక్కండి.
Step 6: దీని తర్వాత మీ పాత పిన్‌ని నమోదు చేసి, కొత్త పిన్‌ని సెట్ చేయండి.

Read Also: YS Viveka Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ.. సీబీఐ ముందుకు వెళ్తారా?

Exit mobile version