UPI Payments : షాకింగ్.. ఫిబ్రవరి 1 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరు
- UPI కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2025 నుండి అమలు
- స్పెషల్ క్యారెక్టర్లు (@,
- , $) ట్రాన్సాక్షన్ ఐడీలో నిషేధం
- NPCI ఆదేశాలు ఆల్ఫాన్యూమరిక్ ట్రాన్సాక్షన్ ఐడీ తప్పనిసరి
- కస్టమర్ భద్రత, ఫేక్ ట్రాన్సాక్షన్లు అరికట్టేందుకే ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు. ఈ యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినిపిస్తుంది. ఏదైనా యూపీఐ యాప్ లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే (@, #, $ మొదలైనవి) ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయబడుతుంది. భారతదేశంలో లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించే అనేక యాప్‌లు ఉన్నాయి. అయితే, Paytm, Phonepe వంటి సాధారణంగా ఉపయోగించే యాప్‌లు లావాదేవీ ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించవు.
Read Also:Telangana Power Demand : విద్యుత్ సరఫరా కోసం నోడల్ ఆఫీసర్లు ఎంపిక
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అన్ని యూపీఐ యాప్‌లను లావాదేవీ ఐడీ(ట్రాన్సాక్షన్ ఐడీ)లో ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి 1, 2025 తర్వాత వాటి లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. NPCI 9 జనవరి 2025న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అన్ని UPI యాప్‌లు ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్ల(@, #, $ మొదలైనవి) ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read Also:Yadagirigutta : టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు…
ఏదైనా యూపీఐ యాప్ ఈ నియమాన్ని పాటించకపోతే ఆ యాప్ నుండి యూపీఐ లావాదేవీలు పనిచేయవు. ఈ నియమం వ్యాపార వినియోగదారులకు వర్తిస్తుంది. కానీ ఇది సాధారణ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ నియమాన్ని పాటించని ఏదైనా యాప్‌తో UPIని ఉపయోగిస్తే, మీ పేమెంట్స్ రద్దు చేయబడతాయి. ట్రాన్సాక్షన్ ఐడీని 35 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌గా మార్చగలిగేలా ఈ మార్పు చేయడానికి NPCI ఇప్పటికే అన్ని యూపీఐ యాప్‌లకు సమయం ఇచ్చింది. దీనితో పాటు ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీలను నివారించాలని యాప్‌లకు కూడా సూచించింది. ఈ మార్పు వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. లావాదేవీలను ట్రాక్ చేయడం సులభం అవుతుంది.. అంతేకాకుండా కస్టమర్ల భద్రత కూడా పెరుగుతుంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?