NTV Telugu Site icon

Update On Murder Case : నిందుతుడి మానసిక పరిస్థితి బాగోలేదు.. మైనర్ బాలిక హత్య కేసు అప్డేట్..

Anakapalli

Anakapalli

Update On Murder Case : అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో శనివారం ఓ దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి అమ్మాయిని హత్య చేశాడు. ప్రస్తుతం కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు. ఇక 20 రోజుల కిందట బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్ తనని జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని దారుణానికి సురేష్ పాల్పడ్డారు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక పై దాడి చేసేందుకు అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చేరుకున్న సురేష్ వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి పీక కోసి పరార్ అయ్యాడు. ఆపై సంఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీం నిందితుడు కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఇక కేసు సమందించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Urfi Javed : ఫుల్ గా తాగిన మత్తులో మీడియాకు అడ్డంగా దొరికిన ఉర్ఫీ జావేద్

ఇక ఈ ఘటనపై తాజాగా ఎన్టీవీతో అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 టీంలతో గాలిస్తున్నామని., 4 నెలల క్రితం మైనర్ బాలికపై అత్యాచారయత్నం కేసులో ఫోక్సో యాక్ట్ క్రింద అరెస్టు చేశామని తెలిపారు. ఈ సంఘటనలో నిందితుడు ఒక నోట్ రాసి ఈ దారుణానికి ఒడిగట్టాడని., అందులో మేటర్ ఆధారంగా కూడ దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నందున కొన్ని విషయాలు వెల్లడించలేమని., ఏప్రిల్ లో మృతురాలు సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామని., కోర్టులో గుడ్ బిహేవియర్ కింద బెయిల్ మీద వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు మానసిక పరిస్థితి కూడా బాగోలేదని ఆయన పేర్కొన్నారు.

CM Revanth Reddy: జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఈ విషయంపై రాష్ట్ర హోమ్ మినిష్టర్ అనితా రీయాక్షన్ అయ్యారు. దురదృష్టవశాత్తు రాంబిల్లి మండలంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యింది., నిందితుడు కోసం ఇప్పటికే 12 పోలీసు బృందాలు గాలీస్తున్నాయి., త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాము., మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాము. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆదుకుంటాము., గంజాయి వినియోగం ఎక్కువ అవడంతోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి., 3 నెలల క్రితం జైలుకి వెళ్లి బయటకొచ్చి ఈ దారుణనికి ఒడిగట్టాడని ఆమె పేర్కొన్నారు.