NTV Telugu Site icon

Aadhar Card Update: అప్పటి వరకే ఆధార్ కార్డు ఉచిత అప్డేట్.. ఆపై బాదుడే..

Aadhar Card Update

Aadhar Card Update

Aadhar Card Update: దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాలలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది. అటువంటి పరిస్థితిలో, అనేక సార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. అయితే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) మీకు సెప్టెంబరు 14 వరకు ఆధార్‌ ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

September 14th తర్వాత ఫీజు చెల్లించాల్సిందే..

ఆధార్ కార్డు తీసుకోని పదేళ్లు పూర్తి అయిన వారి ఆధార్ కార్డులను అప్డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. అంతకుముందు, ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి జూన్ 14 చివరి తేదీగా ఉంచగా., దానిని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. మీరు ఈ తేదీ వరకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) డాక్యుమెంట్‌ లను ఉచితంగా అప్డేట్ చేయవచ్చు. ఇలా చేసుకోవడానికి ” మై ఆధార్ ” పోర్టల్‌ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రంలో ప్రతి అప్డేట్‌ కు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డును అప్డేట్..

ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, UIDAI వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.inని సందర్శించి.. అప్డేట్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్, OTPని నమోదు చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ అప్డేట్‌ పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాలి. దీని తర్వాత, డ్రాప్ డౌన్ మెనులో.. మీరు గుర్తింపు కార్డు, చిరునామా రుజువు ID ని స్కాన్ చేసి దానిని అప్లోడ్ చేసి సమర్పించాలి. ఇప్పుడు మీకు రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ స్థితిని తనిఖీ చేయవచ్చు.