Site icon NTV Telugu

Upasana : మెగా ఫ్యాన్స్‌కు .. ఉపాసన నుంచి డబుల్ గుడ్ న్యూస్

Upasana

Upasana

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తాను గర్భవతిగా ఉన్నందున అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోయానని తెలిపారు. ఈ గుర్తింపు మరింత ఎక్కువగా పనిచేయడానికి, తమ పరిమితులను అధిగమించడానికి ప్రేరణనిస్తుందని ఉపాసన పేర్కొన్నారు. బిజినెస్ కార్యకలాపాలతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఉపాసనపై ఈ సందర్భంగా శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

Also Read : Vishnu Priya : నిజంగా ఆయన అలాంటివాడని అనుకోలేదు.. వేణు స్వామి పై విష్ణు ప్రియ సంచలన వ్యాఖ్యలు

అంతేకాకుండా, రామ్‌చరణ్, ఉపాసన దంపతుల ఇంట త్వరలో మరోసారి శుభవార్త వినిపించనుంది. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట, 2023 జూన్‌లో తమ మొదటి బిడ్డ క్లీంకారకు జన్మనిచ్చారు. తాజాగా, ఉపాసన రెండోసారి గర్భం దాల్చారు. దీపావళి సంబరాలలో భాగంగా ఆమెకు సీమంతం నిర్వహించిన దృశ్యాలు, అలాగే ‘డబుల్’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం ద్వారా ఈసారి ఆమె కవలలకు జన్మనివ్వబోతున్నట్లు వస్తున్న వార్తలను ఉపాసన స్వయంగా ధృవీకరించారు. గతంలో రెండో సంతానం విషయంలో ఆలస్యం చేయదలచుకోలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ మెగా కోడలు కవలలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో, మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version