Site icon NTV Telugu

UP Samosa Fight: సమోసా తీసుకురాని భర్త.. పొట్టుపొట్టు కొట్టిన భార్య

Up Samosa Fight

Up Samosa Fight

UP Samosa Fight: నిజంగా ఇది విచిత్రమే.. ఆలుమగల మధ్య వచ్చే పంచాయతీలు విడ్డూరంగా ఉంటాయనేది నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్‌‌లో ఓ సంచలన ఘటన వెలుగుచూసింది. పాపం భర్త.. భార్య, అత్తమామల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది.. ఆ భర్త చేసిన తప్పు ఏంటి, కట్టుకున్న మొగుడిని కన్న తల్లిదండ్రులతో భార్య కొట్టించడం ఏంత వరకు సబబు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Charminar : ట్యాంక్‌బండ్ కు తరలివస్తున్న భారీ గణనాథులు

మతిమరుపు బొక్కలు ఇరగదీసింది..
పిలిభిత్ జిల్లా భగవంతపూర్‌లోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన శివమ్‌కు సంగీతతో మే 22న వివాహం అయ్యింది. దంపతులు వాళ్ల కొత్త సంసారాన్ని సక్రమంగా, సంతోషంగా కొనసాగిస్తున్నారు. ఎందుకో సంగీతకు ఆగస్టు 30న సమోసాలు తినాలనిపించి భర్తకు ఫోన్ చేసి తీసుకొని రమ్మని కోరింది. వచ్చేటప్పుడు కచ్చితంగా సమోసాలు తీసుకొని రావాలని మరీమరీ చెప్పింది. పాపం మనోడు ఏ బిజీలనో పడి భార్య చెప్పిన మాటలను మర్చిపోయి ఇంటికి వచ్చాడు. ఇగ చూడాలి సంగీత శివతాండవం. ఎట్లా నువ్వు నేను చెప్పింది తేకుండా ఇంటికి వస్తావని మొదలు పెట్టి.. పాపం శివమ్‌కు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా తిట్ల భారతం షురూ చేసింది. ఎంతకీ ఆమె శాంతించక పోగా తల్లిదండ్రులు ఉషా, రామ్‌లదతేలకు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. వచ్చిన వాళ్లు వచ్చేటప్పుడు బిడ్డకు ఇష్టమైన సమోసాలు పట్టుకొని పోతే పంచాయతీ అక్కడితోనే సమసిపోయేటిది కావచ్చు. కానీ వాళ్లు పట్టుకుపోలే.. పోయిన తర్వాత భార్యభర్తల పంచాయతీ తెలుసుకొని అల్లుడిని బిడ్డ నుంచి రక్షించకపోగా.. బిడ్డతో కలిసి అల్లుడిని తిట్టడమే కాకుండా చావబాదారని శివమ్ వాపోయాడు.

శివమ్‌ మరుసటి రోజు ఈ కేసును పంచాయతీకి తీసుకెళ్లాడు. ఆగస్టు 31న పంచాయతీలో పరిస్థితిని చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మాజీ గ్రామ సర్పంచ్ అవధేష్ శర్మ సమక్షంలో పంచాయతీ జరిగింది. ప్రారంభంలో పంచాయతీ పరిష్కారం దిశగా సాగుతున్నట్లు అనిపించింది… కానీ పరిస్థితి ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయి, విషయం పరిష్కారం కాలేదు. అక్కడే మరోసారి సంగీత ఆమె తల్లిదండ్రులు శివమ్‌పై, ఆయన తండ్రి రాంతోతార్‌పై దాడి చేశారు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

READ ALSO: Health Benefits of Music: ఏంటి..! పాటలు వినడం వల్ల ఇన్ని లాభాలా..?

Exit mobile version