Site icon NTV Telugu

Uttarpradesh: అరేయ్ ఏంట్రా ఇది.. గరమైండని.. డీఈఓపై హెచ్.ఎమ్ దాడి..

Untitled Design (13)

Untitled Design (13)

డీఈఓ గరమైండని జిల్లా విద్యాశాఖాధికారిని బెల్ట్ కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్‌ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని డీఈఓ ఫైర్ కావడంతో దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లా విద్యాశాఖ అధికారిని బెల్ట్‌తో కొట్టాడు ఓ స్కూల్ హెడ్ మాస్టర్. టీచర్‌ను వేధించిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన మాస్టర్.. సరిగ్గా డిటెయిల్స్ చెప్పాలని డీఈఓ ఫైర్ కావడంతో దాడికి పాల్పడ్డాడు. మహమూదాబాద్‌ బ్లాక్‌కు చెందిన నద్వా విశేశ్వర్ గంజ్ ప్రైమరీ స్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్న బిజేంద్ర కుమార్ వర్మ.. అదే స్కూల్‌లో పని చేస్తున్న ఫిమేల్ అసిస్టెంట్ టీచర్‌ను వేధించాడు. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు.

దీంతో వర్మ హరాస్మెంట్‌పై వివరణ ఇచ్చేందుకు బేసిక్ శిక్షా అధికారి కార్యాలయానికి వెళ్లాడు. అసిస్టెంట్ టీచర్‌పై వేధింపులు నిజమేనని సాక్షులు చెప్పడంతో ఉద్రిక్తత పెరిగింది. ఎడ్యుకేషన్ ఆఫీసర్ అఖిలేష్ ప్రతాప్ సింగ్ కూడా వర్మ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాగ్వాదం పెరిగింది. దీంతో హెడ్ మాస్టర్ ఫైల్‌ను డెస్క్‌పై కొట్టి.. నడుముకున్న బెల్ట్ తీసి ఆఫీసర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆపిన క్లర్క్‌ను కూడా నెట్టేశాడు. క్యాబిన్‌లో గొడవ శబ్దానికి బయట నుంచి వచ్చిన చాలా మంది ఆపడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో విద్యా శాఖ ఆయనను వెంటనే సస్పెండ్ చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version