Site icon NTV Telugu

UP Man Wins Lottery: 30 ఏళ్ల యువకుడికి రూ.34 కోట్ల బహుమానం.. దుబాయ్‌లో యూపీ యువకుడి అదృష్టం..

Up Man Wins Lottery

Up Man Wins Lottery

UP Man Wins Lottery: పొట్ట చేతిలో పట్టుకొని పరాయి దేశానికి వలస పోయిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది. ఒక్క రోజులో మనోడు యూఏఈలో కొత్త మిలియనీర్‌గా అవతరించాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కొత్త మిలియనీర్ మన దేశానికి చెందిన వ్యక్తే. ఆయనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్. ఇంతకీ సందీప్‌కు అంతలా అదృష్టం ఏలా కలిసి వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Vijayawada: విజయవాడ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ కు తప్పిన పెను ప్రమాదం.. అసలేమైందంటే…

15 మిలియన్ దిర్హామ్‌ల లక్..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్ ప్రసాద్ గత మూడు ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ 30 ఏళ్ల యువకుడు అక్కడి బిగ్ టికెట్ లాటరీ సిరీస్ 278లో 15 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 34 కోట్లు) బహుమతిని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన డ్రా ఆయన్ని యూఏఈలో కొత్త మిలియనీర్‌గా మార్చింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు లాటరీ తగిలిన విషయం తన స్నేహితుల ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదట్లో తాను క్రమం తప్పకుండా టిక్కెట్లు కొనలేదని అన్నాడు. కానీ గత మూడు నెలలుగా వాటిని కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. ఆగస్టు 19న తన లక్కీ టికెట్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక్కడ మ్యాజిక్ ఏమిటంటే తాను ఒక్కడినే ఈ టికెట్ కొనుగోలు చేయలేదని, మరో 20 మందితో కలిసి దానిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన తన బహుమతిని 20 మందితో పంచుకోవలసి ఉంటుంది. ఇదే జరిగితే మనోడికి రూ.1.70 కోట్లు మాత్రమే వస్తాయి. డ్రా తీసిన సెప్టెంబర్ 3న లైవ్ షో సమయంలో అబుదాబి నుంచి సందీప్‌కు కాల్ వచ్చినప్పుడు, ఆయన అతను షో కూడా చూడటం లేదని చెప్పాడు. మొదట తన అదృష్టాన్ని తాను నమ్మలేదని, కానీ హోస్ట్ తన విజయాన్ని ధృవీకరించిన వెంటనే, తీవ్రమైన భావోద్వేగానికి గురనట్లు చెప్పారు.

ఆయన ఏం చెప్పారంటే..
తన అదృష్టంపై సందీప్ మాట్లాడుతూ.. హోస్ట్ తన విజయాన్ని ధృవీకరించిన వెంటనే, తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ‘నా జీవితంలో మొదటిసారిగా చెప్పలేనంత ఆనందం వచ్చింది’ అని అన్నాడు. అతను దుబాయ్ డ్రైడాక్స్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వచ్చిందే కుటుంబ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి అని చెప్పారు. తన తండ్రికి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ డబ్బులతో ఆయన ఆరోగ్యం బాగు చేయిస్తానని చెప్పారు. ఈ విజయం తన కుటుంబానికి అవసరమైన బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇప్పుడు తను తన సొంత వ్యాపారం ప్రారంభించాలనే కలతో భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు.

READ ALSO: Mrunal Thakur : అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

Exit mobile version