Site icon NTV Telugu

UP: “నువ్వు రా లేదా వేరే అమ్మాయిని తీసుకురా”… నర్సు, ప్రభుత్వ డాక్టర్ ఆడియో క్లిప్ వైరల్..!

Fake Doctor

Fake Doctor

Uttar Pradesh Doctor Viral Audio: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, మహిళా ఆరోగ్య కార్యకర్తకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ క్లిప్ ఆరోగ్య శాఖలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన లంబువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్.. ఒక మహిళా ఆరోగ్య కార్యకర్తతో ఫోన్‌లో అనుచితంగా సంభాషిస్తున్నట్లు ఆడియో ద్వారా బట్టబయలైంది.

READ MORE: Suicide : భార్య మందలించిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య

వైరల్ అవుతున్న ఆడియోలో ఆ వైద్యుడు ఆ మహిళను కలవమని.. డేటింగ్ కి తీసుకెళ్తానని చెప్పాడు. అలాగే షాపింగ్ కి తీసుకెళ్తానని చెబుతూ.. తన ప్రేమగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. నువ్వు రాకపోయినా వేరే అమ్మాయిని అయినా తీసుకురమ్మని, ఎంత డబ్బైనా ఇస్తానని ఆ సిగ్గులేని వైద్యుడు పేర్కొన్నాడు. ఆ మహిళ నర్సు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తి చేసింది. ఇలాగే వేధిస్తే ఉద్యోగం మానేస్తానని తేల్చి చెప్పేసింది. అంతటితో ఆగకుండా ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ భూషణ్ కు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి CMO ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరి వాదనాలు విని వాంగ్మూలాలను నమోదు చేస్తున్నామని టీం తెలిపింది. ఇరువురి వాంగ్మూలాల తర్వాత.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. కామాంధుడైన డాక్టర్ అనిల్ కుమార్‌ను అక్టోబర్ 13న లంబువా సిహెచ్‌సి నుంచి కదిపూర్‌కు బదిలీ చేశారని గమనించాలి. వైద్య సంరక్షణ సరిగ్గాలేక లంబువా సిహెచ్‌సిలో ఒక మహిళ మరణించింది. దీంతో ఆ కీచకుడిని బదిలీ చేయగా.. ఇటీవల కదిపూర్‌లో బాధ్యతలు స్వీకరించాడు.

READ MORE: Off The Record: జూబ్లీహిల్స్ జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతుంది?

Exit mobile version