UP: హిందువుగా నటిస్తూ లవ్ ట్రాప్.. 100 మంది హిందూ యువతులపై గ్యాంగ్‌రేప్, బ్లాక్‌మెయిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: యూపీలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిందువుగా నటించి యువతుల ఓ గ్యాంగ్ మోసం చేసింది. ప్రేమ, నమ్మకం పేరుతో ఓ గ్యాంగ్ చేసిన దారుణ ఘటన స్థానిక ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్ఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి చాలా మంది యువతులను మోసం చేసినట్టు బాధితులు చెబుతోంది. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: Meena : పెళ్లి అంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా.. మీనా షాకింగ్ కామెంట్స్
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
బస్తీ నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ యువతికి 2022 జనవరిలో ప్రిన్స్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడు తన అసలు పేరు అజఫరుల్ హక్. కానీ.. తాను హిందువునని, మంచి కుటుంబం నుంచి వచ్చానని ఆ యువతితో పరిచయం చేసుకున్నాడు. చేతికి దారం కట్టుకుని ఆ యువతిని నమ్మించాడు. “నీకు ఇంకా మంచి హాస్పిటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తాను” అని నమ్మబలికాడు. అలా మాట్లాడుతూనే ఆమె మొబైల్ నంబర్ తీసుకున్నాడు. రోజులు గడిచేకొద్దీ వీరిద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఈ మాటలు కాస్త ప్రేమగా మారాయి. ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా అజఫరుల్ చాలా జాగ్రత్తగా నటించాడు. పూర్తిగా నమ్మకం సంపాదించిన తర్వాత ఆమెతో బలవంతంగా శరీక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెబుతూ అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతికి పరిస్థితి అర్థమయ్యేలోపే ఆమె జీవితం అతడి చేతుల్లో చిక్కుకుంది. ఒక రోజు ఆమె ధైర్యం చేసి ఆ యువకుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అక్కడ మరో దారుణం చోటు చేసుకుంది. ప్రిన్స్ తన అన్న, మిత్రులతో కలిసి ఆమెపై గ్యాంగ్‌రేప్ చేశారు. అదే సమయంలో అభ్యంతరకర వీడియోలు తీశారు. ఇక అక్కడినుంచి అసలు నరకం మొదలైంది. ఆ వీడియోలను చూపిస్తూ బెదిరింపులు మొదలయ్యాయి. “మా మాట వినకపోతే ఈ వీడియోలు బయట పెడతాం” అని భయపెట్టారు. ఇలా ఆ యువతిని ట్రాప్ చేసి అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పిలిచినప్పుడు వెళ్లక పోతే ఆ యువతి కుటుంబాన్ని వేధించేవారు. చివరకు యువతి అన్నను సైతం అపహరించారు. దీంతో ఆ కుటుంబం పూర్తిగా చితికిపోయింది. బతకడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఆ గ్యాంగ్ చెప్పినట్టే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
READ MORE: India US Trade Deal: ఇది చారిత్రక మైలురాయి.. మోడీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభినందనలు..
ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ పాత నేరస్థుడు. పోలీస్ స్టేషన్‌కు తెలిసిన హిస్టరీషీటర్. అతడి కుటుంబ సభ్యులు సైతం ఈ పనులకు సహకరించేవారని బాధితురాలు ఆరోపించింది. హిందువులుగా నటిస్తూ అతడు, అతడి అన్న కలిసి వందలాది యువతులను ప్రేమలో పడేసి, వీడియోలు తీసి, బ్లాక్‌మైల్ చేసి, వారిని దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు, నేపాల్ వంటి ఇతర దేశాలకు పంపించారని బాధితురాలు తెలిపింది. కొందరిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టారని చెప్పింది. తనను కూడా అదే దారిలో నెట్టే ప్రయత్నం చేశారని కన్నీళ్లతో వివరించింది. చివరకు ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఆరోపణల తీవ్రతను గుర్తించిన కోత్వాలి పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రిన్స్‌తో పాటు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అజఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మిగిలినవారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్పీ సత్యేంద్ర భూషణ్ తివారీ మాట్లాడుతూ.. బాధిత మహిళకు న్యాయం చేయడానికి చట్టపరమైన చర్యలు మొదలయ్యాయని తెలిపారు. దర్యాప్తులో ఏ విషయాలు బయటపడతాయో వాటి ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!