Unni Mukundan : ‘మార్కో’ గా అలరించబోతున్న మలయాళి నటుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో ‘ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత తెలుగు లో ‘భాగమతి’, ‘ఖిలాడీ’ మరియు ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది చివర్లో ఉన్ని ముకుందన్ నటించిన మాలికాపురం అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది.. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్‌లు సాధించి భారీ రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే ఉన్ని ముకుందన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మార్కో (Marco). మైఖేల్ మరియు ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ డ్రామా గా రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ క్రమం లో సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ అప్‌డేట్ ను ఇచ్చారు.ఈ మూవీ నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ”మీరు అతని విలనిజం చూశారు కదా..ఇప్పుడు అతని హీరోయిజం చూస్తారు” అంటూ మోషన్ పోస్టర్ కు మేకర్స్ క్యాప్షన్ ను ఇచ్చారు. ఇక ఈ మోషన్ పోస్టర్ లో ఉన్ని ముకుందన్ సిగార్ పట్టుకుని యాక్షన్ మోడ్ లో ఉన్న లుక్ లో కనిపించాడు.2024 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యానర్ పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..అలాగే ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది .ఈ మూవీ తో ఉన్ని ముకుందన్ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
తాజావార్తలు
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!