Site icon NTV Telugu

AP Elections 2024: నేడు ఏపీకి కేంద్ర మంత్రులు..

Bjp

Bjp

AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు పర్యటించనున్నారు.. ఏపీలో నామినేషన్ల పర్వం రోజుగా కొనసాగుతండగా.. ఈ సారి టీడీపీ-జనసేన తో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతోన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొంతమంది నామినేషన్ల దాఖలు చేశారు.. ఈ రోజు మరికొందరు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ తరుణంలో ఏపీకి వస్తున్నారు కేంద్ర మంత్రులు..

Read Also: Twinkle Khanna: దావూద్ పార్టీలో హీరోయిన్ డాన్స్.. షాకింగ్ కామెంట్స్

నేడు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. ఆయన నామినేషన్‌ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ ఎన్నికల ఇంఛార్జి అరుణ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొనబోతున్నారు. ఇక, అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ యాదవ్.. ఆయన నామినేషన్ కు హాజరు కానున్న కేంద్ర మంత్రి వీకే సింగ్ హాజరుకానున్నారు. మరోవైపు.. కైకలూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మాజీ మంత్రి కామినేని శ్రీ నివాస్.. ఆయన నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ పాల్గొనబోతున్నారు.. ఇక, విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణు కుమార్ రాజు ఈ రోజు నామినేషన్‌ వేయనుండగా.. ఆ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాజరుకాబోతున్నారు.

Exit mobile version