Site icon NTV Telugu

Nitin Gadkari: నేడు తెలంగాణకు నితిన్ గడ్కరీ..

Nithin

Nithin

కేంద్రమంత్రి నితిన్ గడ్కరి నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కొమురం భీం జిల్లాకు వెళ్లనున్నారు. జాతీయరహదారి 363 ని జాతికి అంకితం చేయనున్నారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంబోత్సవాలు,శంఖుస్థాపనలు చేయనున్నారు. కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండిసంజయ్, రాష్ట్రమంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క పాల్గోననున్నారు.

Also Read:Kanpur: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం.. 5 మందికి తీవ్ర గాయాలు

అనంతరం సంగారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పర్యటించనున్నారు. సాయంత్రం 3.50కి హెలికాప్టర్ లో ఇక్రిశాట్ చేరుకోనున్నారు మంత్రులు నితిన్ గడ్కరీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో BHEL వద్దకు చేరుకొని లింగంపల్లి- BHEL ఫ్లై ఓవర్ ని ప్రారంభించనున్నారు.

కాగజ్‌నగర్ వద్ద ప్రారంభించే కీలక ప్రాజెక్టులు:

నిర్మల్–ఖానాపూర్ మార్గంలో 17.79 కిమీ రోడ్డు వెడల్పు పనుల పూర్తి

మంచిర్యాల్–రేపల్లెవాడ మధ్య 42 కిమీకి రూ. 2,001 కోట్లతో నాలుగు లేన్ మార్గం

రేపల్లె–మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కిమీకి రూ. 1,525 కోట్లతో మార్గం అభివృద్ధి

కడ్తాల్ వద్ద రూ. 23.54 కోట్లతో 6 లేన్ అండర్‌పాస్

నాగ్‌పూర్–హైదరాబాద్ సెక్షన్ లో సర్వీస్ రోడ్లు, జంక్షన్ల మార్పు

Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
 

 

హైదరాబాద్ లో ప్రారంభించనున్న ప్రాజెక్టులు:

అంబర్‌పేట్ ఫ్లైఓవర్ (1.47 కిమీ, రూ. 415 కోట్లు)

ఆరాంఘర్–శంషాబాద్ మధ్య 10 కిమీకి 6 లేనింగ్ ప్రాజెక్ట్ భూమిపూజ

మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్, జాప్తి శివనూర్, గోల్డెన్ ధాబా Y జంక్షన్ వద్ద అండర్‌పాస్లు

కామారెడ్డి జిల్లా టెక్రియాల్, పొందుర్తి, పద్మాజివాడ జంక్షన్లలో అండర్‌పాస్లు, సర్వీస్ రోడ్లు

ఆలేరు-జీడికల్ X రోడ్స్ వద్ద 6 లేన్ అండర్‌పాస్ (హైదరాబాద్–వరంగల్ సెక్షన్)

BHEL జంక్షన్ వద్ద రూ. 172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం

అంతేకాకుండా, రూ. 657 కోట్ల విలువ గల 21 కిమీ పొడవు ఉన్న 7 ప్రాజెక్టులకు గడ్కరీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేయనున్నారు.

Exit mobile version